హనుమాన్‌ మా ముస్లిం: బీజేపీ ఎమ్మెల్సీ

21 Dec, 2018 05:27 IST|Sakshi

లక్నో: హనుమంతుడు దళితుడంటూ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ చేసిన వ్యాఖ్యలపై దుమారం చల్లారకమునుపే మరో వివాదం తెరపైకి వచ్చింది. ఆంజనేయుడు దళితుడు కాదు, ముస్లిం.. అంటూ బీజేపీకే చెందిన ఎమ్మెల్సీ బుక్కల్‌ నవాబ్‌ కొత్త వాదన తెరపైకి తెచ్చారు. ముస్లిం పేర్లు రహ్మాన్, ఫర్హాన్‌ లాగా ఆయన పేరు కూడా హనుమాన్‌ అని ఉండటమే అందుకు రుజువు అని ఆయన వాదిస్తున్నారు. ‘అందరికీ ప్రీతిపాత్రుడైన దైవస్వరూపుడు హనుమంతుడు. మతం, కులం, వర్గం అనే బేధం లేకుండా ఆయన అందరి పూజలు అందుకుంటున్నారు. మా మతంలోని వారికి ఉండే పేర్లు సల్మాన్, రెహ్మాన్, రంజాన్, జిషాన్, కుర్బాన్‌.. మాదిరిగానే హనుమాన్‌ పేరు కూడా ఉంది. అందుకే, నాకు తెలిసినంతవరకూ ఆయన మహమ్మదీయుడు’ అని బుక్కల్‌ నవాబ్‌ తన వాదనను సమర్థించుకున్నారు.

మరిన్ని వార్తలు