కాంగ్రెస్‌ స్కూల్‌ రాజకీయాలు మానుకోవాలి!

16 Mar, 2019 16:40 IST|Sakshi

చెన్నై : బహు భాషా నటుడు మాధవన్‌ వివాదాలకు చాలా దూరంగా ఉంటారు. తన సినిమాలతో బిజీగా ఉంటూ.. అప్పుడప్పుడు సామాజిక అంశాలపై సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తుంటారు. రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండే ఈ హీరో, తాజాగా కాంగ్రెస్‌ తీరును విమర్శిస్తూ చేసిన ట్వీట్‌ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కాంగ్రెస్‌ ఐటీ విభాగం ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తూ రిలీజ్‌ చేసిన వీడియో వివాదస్పదంగా మారింది. ప్రధాని నరేంద్ర మోదీని బలహీన పరుస్తు..  చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు మోదీ భయపడుతున్నట్టు చూపించే ఈ వీడియోపై అందరూ విమర్శిస్తున్నారు. తాజాగా హీరో మాధవన్‌ కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘ఇది చాలా బాధకరం. మీ రాజకీయాల కోసం మన దేశ ప్రధాని నరేంద్ర మోదీని కించపరచటం విచారకరం.. అది కూడా చైనా ముందు మన దేశాన్ని, మోదీని తక్కువ చేయడం నచ్చలేదు. ఇది మీకు ఆనందం కలిగించవచ్చు కాని దేశానికి అవమానం కలిగించేలా ఉంది. ఇవన్ని స్కూల్‌ రాజకీయాలను తలపిస్తున్నాయి. ఇలాంటివి మానుకుంటే మీకు, దేశానికి మంచిది ఇలాంటివి మరోసారి మీ నుంచి కోరుకోవడం లేదు’అంటూ మాధవన్‌ పేర్కొన్నారు. కాగా మాధవన్‌ వ్యాఖ్యలు నెట్టింట్లో తెగ వైరల్‌గా మారాయి. ఇక కాంగ్రెస్‌ పోస్ట్‌ చేసిన వీడియోపై కూడా నెటిజన్లు మండిపడుతున్నారు.  

ప్రస్తుతం ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న ‘రాకెట్రీ’ అనే చిత్రంలోని టైటిల్‌ రోల్‌ను మాధవన్‌ పోషిస్తున్నారు. అంతేకాకుండా త‌మిళ ద‌ర్శకుడు అనంత మ‌హ‌దేవ‌న్‌తో కలిసి మాధవన్‌ స్వయంగా దర్శకత్వం వహిస్తున్నాడు. నంబి నారాయ‌ణ్ జీవితంలోని మూడు ప్రధాన కోణాల‌ని బ‌యోపిక్‌లో చూపించనున్నట్టు తెలుస్తోంది. తెలుగు, తమిళ, ఇంగ్లీష్‌, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2019 సమ్మర్‌కు రిలీజ్ చేయనున్నారు.  

కాంగ్రెస్‌ పోస్ట్‌ చేసిన వీడియో ఇదే..

మరిన్ని వార్తలు