మధుయాష్కీకి నిరసన సెగ

6 Dec, 2018 23:00 IST|Sakshi
కారు అద్దాలను ధ్వంసం చేసిన దృశ్యం 

రెండు వాహనాల అద్దాలు ధ్వంసం చేసిన కొమురెడ్డి వర్గీయులు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు

మెట్‌పల్లి (కోరుట్ల): కాంగ్రెస్‌ నేత మధుయాష్కీకి నిరసన సెగ తగిలింది. ఆ పార్టీకి చెందిన కొమురెడ్డి రాములు వర్గీయులు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు గురువారం రాత్రి ఆయన వాహనాలను ధ్వంసం చేశారు. తమ నాయకుడికి టికె ట్‌ రాకుండా చేశారని రాములు అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేయగా.. డబ్బులు పంచేందు కు ఇక్కడికి వచ్చారని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో చోటుచేసుకుంది. మధుయాష్కీ కొందరితో కలసి రెండు వాహనాల్లో పట్టణంలోని చైతన్యనగర్‌లోని ఓ ఇంటికి వ చ్చారు. విషయం తెలుసుకున్న రాములు వర్గీయులు తమ నాయకుడికి టికెట్‌ రాకుండా చేశారని నిలదీశారు. మధుయాష్కీ వచ్చిన విషయం తెలుసుకున్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రావడమే కాకుండా పెద్దఎత్తున డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ అ క్కడ బైఠాయించి ఆందోళనకు దిగారు. మధుయాష్కీతో వాగ్వాదానికి దిగారు. అయినా ఆయన పట్టించుకోకుండా వెళ్లిపోతుండటంతో ఆగ్రహించిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అడ్డుకున్నారు. తర్వాత వాహనం దిగి మరో వాహనంలో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం వాహనాలను డ్రైవర్లు తీసుకువెళ్తుండగా.. వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. పోలీసులు వాహనాలను అక్కడి నుంచి పంపించి వేశారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్‌ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

దాడిని ఖండించిన ఉత్తమ్‌ 
సాక్షి, హైదరాబాద్‌: ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీ గౌడ్‌పై గురువారం రాత్రి మెట్‌పల్లిలో జరిగిన దాడిని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఖండించారు. ఈ దాడి అనాగరికమైన చర్య అని, ఓటమి భయంతోనే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో పోలీసులు పక్షపాతధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు.  

మరిన్ని వార్తలు