కేసీఆర్‌కు కూటమి భయం: మధుయాష్కీ

4 Oct, 2018 01:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌పై ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిజామాబాద్‌ సభలో సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ బుధవారం తన నివాసంలో  ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సచివాలయానికి రాకుండా బుల్లెట్‌ ప్రూఫ్‌ బాత్‌రూమ్‌లు కట్టుకున్న కేసీఆరా కాంగ్రెస్‌ను విమర్శించేదని ఎద్దేవా చేశారు.

ప్రజల కోసం ఏర్పడుతున్న మహాకూటమి కేసీఆర్‌కు రాజకీయంగా బొందపెట్టడం ఖాయమని, కూటమి అంటే కేసీఆర్‌కు భయం పట్టుకుందన్నారు. ‘కేటీఆర్‌ ఆంధ్రా కాంట్రాక్టర్లతో కలసి తిరుగుతుంది నిజం కాదా? అమరావతిలో కేసీఆర్‌ బాబుకు వంగి సలామ్‌లు కొట్టింది నిజం కాదా? చంద్రబాబు తో కలసి రొయ్యల పులుసు తిన్నప్పుడు దోస్తానా గుర్తు రాలేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ వస్తే కాపలా కుక్కలా ఉంటానన్న కేసీఆర్‌ ఇప్పుడు కాటే సే నక్కలా మారారని ధ్వజమెత్తారు. తాను తెలంగా ణ కోసం పనిచేసినప్పుడు కేసీఆర్‌ ఫాంహౌస్‌లో పడుకున్నారన్నారు. నా ఇంటి చుట్టూ ఎన్నిసార్లు తిరిగావో మర్చిపోయావా కేసీఆర్‌ అని ప్రశ్నించారు. సంస్కారంతో మాట్లాడాలని లేదంటే తాము కూడా అదే రీతిలో సమాధానం చెప్తామన్నారు.  

మరిన్ని వార్తలు