‘మహాఘఠ్‌ బంధన్‌’ చీలిపోయింది...

5 Jun, 2019 07:52 IST|Sakshi

న్యూఢిల్లీ/లక్నో: లోక్‌సభ ఎన్నికలకు ముందు ఉత్తరప్రదేశ్‌లో ఏర్పడిన ‘మహాఘఠ్‌ బంధన్‌’ చీలిపోయింది. సార్వత్రిక ఎన్నికల్లో ఊహించిన ఫలితాలు సాధించకపోవడంతో రానున్న ఉప ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని ఎస్పీ, బీఎస్పీ నిర్ణయించుకున్నాయి. బీఎస్పీ చీఫ్‌ మాయావతి మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ‘ఉప ఎన్నికల షెడ్యూల్‌ ఏ క్షణంలోనైనా రావచ్చు. యూపీ ఉప ఎన్నికల్లో అన్ని సీట్లలోనూ ఒంటరిగా పోటీ చేయాలనుకుంటున్నాం’ అని తెలిపారు.

మేం కూడా సిద్ధమే: అఖిలేశ్‌
మహాగఠ్‌ బంధన్‌ లేకుంటే రానున్న ఉప ఎన్నికల్లో మొత్తం 11 చోట్ల నుంచి ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఎస్పీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కూటమి అంత ముఖ్యం కాదని తెలిపారు.

స్వార్థం కోసమే కూటమి
ఎస్పీ, బీఎస్పీ నేతలు తమ కుటుంబసభ్యుల ప్రయోజనాలను కాపాడుకునేందుకే కూటమిగా ఒక్కటయ్యారని బీజేపీ విమర్శించింది. కుల సమీకరణాల ఆధారంగానే ఎన్నికల్లో గెలవాలనుకుని ఆశపడిన మాయావతి, అఖిలేశ్‌ భంగపాటు కలిగిందని పేర్కొంది.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు