‘రేపు కూటమి ఉమ్మడి ప్రణాళికను ప్రకటిస్తాం’

12 Nov, 2018 12:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్‌ మల్లు భట్టి విక్రమార్క నివాసంలో మహాకూటమి నేతలు సోమవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భట్టి విక్రమార్కతోపాటు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌ రమణ, టీడీపీ సీనియర్‌ నాయకులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం, ప్రజా గాయకుడు గద్దర్‌లు పాల్గొన్నారు. ఈ భేటీలో కూటమి ఉమ్మడి ప్రణాళిక, ఎలక్షన్‌ మేనిఫెస్టోలపై నేతలు చర్చించారు. సమావేశం అనంతరం భట్టి మీడియాతో మాట్లాడుతూ.. కూటమిలో కలిసొచ్చే పార్టీలన్ని తమకు ప్రజా సమస్యలపై ముసాయిదా అందజేశాయని తెలిపారు. రేపు మరోసారి భాగస్వామ్య పార్టీలతో సమావేశమై చర్చించిన అనంతరం ఉమ్మడి ప్రణాళిక ముసాయిదాను విడుదల చేయనున్నట్టు వెల్లండించారు.

కోదండరాం మాట్లాడుతూ.. భాగస్వామ్య పార్టీలన్ని ముసాయిదాను అంగీకరించాయని తెలిపారు. నిరంకుశ పాలనకు, సామాన్య ప్రజల ఎజెండాకు మధ్యనే ఎన్నికలు జరగనున్నట్టు పేర్కొన్నారు. కేసీఆర్‌ కుటుంబం ఒక వైపు, తెలంగాణ ప్రజలంతా ఒక వైపు ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. రావుల చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. సామాన్యుల, ఉద్యమకారుల ఎజెండానే తమ ఎజెండా అని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు