‘మహా’ కేబినెట్‌; శివసేనకే ఎక్కువ

27 Nov, 2019 18:48 IST|Sakshi

ముంబై: మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల కూటమి ‘మహారాష్ట్ర వికాస్‌ అఘాడి’ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చురుగ్గా జరుగుతున్నాయి. పదవులు పంపకంపై మూడు పార్టీలు అంగీకారానికి వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. శివసేనకు ముఖ్యమంత్రితో పాటు 15 మంత్రి పదవులు లభించాయి. ఎన్సీపీకి ఉప ముఖ్యమంత్రితో పాటు 13 కేబినెట్‌ బెర్త్‌లు దక్కాయి. కాంగ్రెస్‌కు స్పీకర్‌తో పాటు 13 మంత్రి పదవులు లభించినట్టు తెలుస్తోంది. వైబీ చవాన్‌ భవన్‌లో బుధవారం మధ్యాహ్నం జరిగిన సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ భేటీలో శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌లతో పాటు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు అహ్మద్‌ పటేల్‌, మాణిక్‌రావ్‌ ఠాక్రే పాల్గొన్నారు. మంత్రివర్గ కూర్పు, శాఖల కేటాయింపుపైనా ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది.

‘మహారాష్ట్ర వికాస్‌ అఘాడి’ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన ఉద్ధవ్‌ ఠాక్రే ముఖ్యమంత్రిగా గురువారం శివాజీ పార్క్‌లో ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ను ఆహ్వానించినట్టు కాంగ్రెస్‌ నేత విజయ్‌ వాడెట్టివర్‌ తెలిపారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని తమ ఎమ్మెల్యేలను ఆదేశించినట్టు ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ వెల్లడించారు.

400 మంది రైతు కుటుంబాలకు ఆహ్వానం
ఆత్మహత్య చేసుకున్న 400 మంది రైతు కుటుంబాలను తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఉద్ధవ్‌ ఠాక్రే ఆహ్వానించారు. మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎంఎన్‌ఎస్‌) అధినేత రాజ్‌ ఠాక్రేకూ ఆహ్వానం పంపారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాలను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తామని శివసేన నాయకుడు సంజయ్‌ రౌత్‌ తెలిపారు. (చదవండి: సుప్రియ.. తండ్రికి తగ్గ తనయ)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నిర్మలా సీతారామన్‌ను కలిసిన లక్ష్మణ్‌

‘కట్టా న్యూస్‌’తో ఎందుకు సంచలనం!

సుప్రియ చాణక్యం సూపర్‌!

శివసేనకు కార్యకర్త రాజీనామా

అజిత్‌కు షాకిచ్చిన అమిత్‌ షా!

'బాబుని ధర్మాడి సత్యం కూడా బయటకు లాగలేరు'

శరద్‌ పవార్‌ క్షమించేశారు!!

పట్టిచ్చిన ‘టైం’బాంబ్‌! 

రాజధాని చందాలు.. ఇటుకలు ఏమయ్యాయి..?

'రెండు చక్రాల కన్నా మూడు చక్రాలే ఉత్తమం'

ప్రమాణ స్వీకారానికి మోదీ, షా వస్తారా ?

జనసేనానిపై ఎంపీ విజయసాయి రెడ్డి ఫైర్‌!

మహారాష్ట్ర అసెంబ్లీలో అరుదైన దృశ్యం!

అధినేత సమక్షంలోనే తమ్ముళ్ల తన్నులాట

గవర్నర్‌ను కలిసిన ఉద్ధవ్‌ ఠాక్రే దంపతులు!

ది రియల్‌ కింగ్‌ మేకర్‌!

మూడున్నర రోజుల ముఖ్యమంత్రి!

అసెంబ్లీ సాక్షిగా సీఎం వర్సెస్‌ గవర్నర్‌!

చంద్రబాబును ఫాలో అవుతున్న పవన్‌

అజిత్‌కు ఆత్మీయ స్వాగతం పలికిన సుప్రియా

ఇప్పుడైనా చెప్పేది  వినండి సార్‌..!

బాబూ.. రాజధానిలో ఏం చూడటానికొస్తావ్‌? 

ప్రజలు ఛీకొట్టినా వారికి బుద్ధి రాలేదు

పొలిటికల్‌ సూపర్‌ స్టార్‌..

ఉద్ధవ్‌ స్టైలే వేరు.. 

ఎప్పుడేం జరిగిందంటే.. 

ఉద్దవ్‌ ఠాక్రేకే పీఠం..

సెంటిమెంట్‌తో  ఫినిషింగ్‌ టచ్‌

‘టీడీపీ ఉందన్న భ్రమను కల్పిస్తున్నారు’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నకిలీ ఫోటో వైరల్‌, చిన్మయి వివరణ

వర్మ మరో సంచలనం; టీజర్‌ విడుదల

ఉదయ్‌ కిరణ్‌ బయోపిక్‌.. స్పందించిన సందీప్‌

వాట్సాప్‌లో ఉన్నావా.. లేదు అమీర్‌పేట్‌లో..

నిక్‌ జొనాస్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన ప్రియాంక

ఛీ.. మేకప్‌ లేకుండానే బాగున్నావు