సేనకు హోం, ఎన్సీపీకి ఆర్థికం

13 Dec, 2019 05:21 IST|Sakshi
పవార్‌కు పుష్పగుచ్ఛమిస్తున్న సీఎం ఉద్ధవ్‌

మహారాష్ట్రలో మంత్రుల శాఖలు ఖరారు

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల శాఖలు ఖరారయ్యాయి. కీలక హోం మంత్రిత్వ శాఖను శివసేన తన వద్ద అంటిపెట్టుకుంది. శివసేనకు చెందిన మంత్రి ఏక్‌నాథ్‌ షిండేకు హోంతో పాటు పట్టణాభివృద్ధి, పర్యావరణం, పర్యాటక, పార్లమెంటరీ వ్యవహారాలు శాఖలు, మరో శివసేన మంత్రి సుభాష్‌ దేశాయ్‌కి పరిశ్రమలు, ఉన్నత, సాంకేతిక విద్య, యువజన వ్యవహారాల శాఖలు అప్పగించారు. ఎన్సీపీ మంత్రి జయంత్‌ పాటిల్‌కు ఆర్థిక శాఖను, గృహనిర్మాణం, మరికొన్ని శాఖల బాధ్యతలు అప్పగించారు. మరో ఎన్సీపీ మంత్రి ఛగన్‌ భుజ్‌భల్‌కు నీటి పారుదల, గ్రామీణాభివృద్ది శాఖలు కేటాయించారు. కాంగ్రెస్‌ మంత్రి బాలాసాహెబ్‌ తోరట్‌కు రెవెన్యూ, విద్యుత్, తదితర శాఖలు ఇచ్చారు. మరో కాంగ్రెస్‌ మంత్రి నితిన్‌ రౌత్‌కు పీడబ్ల్యూడీ, గిరిజనాభివృద్ధి శాఖలు అప్పగించారు.  కాగా. గురువారం ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ 79వ పుట్టిన రోజును పురస్కరించుకుని సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ఆయన నివాసంలో పూలగుచ్ఛం అందజేశారు.
 

మరిన్ని వార్తలు