పెద్దాయన మనవడికి తిరుగులేదా?

17 Oct, 2019 14:01 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : శివసేన వ్యవస్థాపక నాయకుడు బాల్‌ ఠాక్రే మనవడు ఆదిత్య ఠాక్రే (29) ముంబైలోని వర్లీ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేయడం ఇటీవల ప్రధానంగా ఆకర్షించిన పత్రికా శీర్షికల్లో ఒకటి. ఠాక్రే కుటుంబం నుంచి నేరుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న మొదటి వ్యక్తి కావడమే కాకుండా పిన్న వయస్సులో పోటీ చేస్తుండడం వల్ల కూడా ఆయన ఈ ఎన్నికల్లో ప్రధాన ఆకర్షకుడిగా నిలబడ్డారు. ఠాక్రే ఇంటి పేరు కారణంగా ఆయనకు పరిచయం అక్కర్లేదు.

బాల్‌ ఠాక్రే 53 ఏళ్ల క్రితం శివసేనను ముంబైలో ఏర్పాటు చేసిన అనతికాలంలోనే అది కొంకణ్, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించి ప్రజల్లో మంచి పట్టును సాధించింది. థాకరే ఎన్నికల్లో స్వయంగా పోటీ చేయకుండా దూరంగా ఉంటూ వచ్చారు. అయితే పార్టీ తరఫున అభ్యర్థులను ఎన్నికల్లో దింపడం ద్వారా రాజకీయ చక్రం తిప్పగలిగారు. బీజేపీతో 25 ఏళ్ల అనుబంధాన్ని తెంపేసుకొని 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడం ద్వారా శివసేన బాగా దెబ్బతిన్నది. తిరిగి రాజకీయంగా మంచి పట్టు సాధించాలనే లక్ష్యంతో,  శివసేన పార్టీలో ఎక్కువ మంది నాయకులు 65 ఏళ్లకు పైబడిన వారవడంతో, యువకులను ఆకర్షించడం కోసం 29 ఏళ్లకే ఆదిత్య ఠాక్రేను రంగంలోకి దింపింది.

ఇక ఆదిత్య ఠాక్రే విజయం తథ్యమని తెలుస్తోంది. ఠాక్రే కుటుంబం పట్ల ఉన్న గౌరవమే కాకుండా ఆయన సరైన ప్రత్యర్థి లేకపోవడం వల్ల ఆయన విజయం సునాయాసమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకటి, రెండు సార్లు మినహా అనేక సార్లు వర్లి నియోజక వర్గం నుంచి శివసేన అభ్యర్థులే విజయం సాధించారు. కాంగ్రెస్‌ పార్టీతో కలిసి పోటీ చేస్తున్న ప్రధాన ప్రతిపక్షమైన ఎన్‌సీపీ తమ అభ్యర్థిగా బహుజన రిపబ్లిక్‌ సోషలిస్ట్‌ పార్టీ నాయకుడు సురేశ్‌ మానేను నిలబెట్టారు. స్థానిక నియోజక వర్గంలో ఆయన పేరు ప్రజలకు పెద్దగా పరిచయం కూడా లేదు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సచిన్‌ అహిర్‌ ఇక్కడి నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో ఆయనపై శివసేన అభ్యర్థి సునీల్‌ షిండే పోటీ చేశారు. ఆ తర్వాత శివసేనలో చేరిన సచిన్‌ అహిర్, ఠాక్రేకు మద్దతుగా ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ఠాక్రే విజయం ఖాయమని తెలుస్తోంది. (చదవండి: ఆదిత్యకు కలిసొచ్చేవి ఇవే...)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ప్రతిపక్ష నేతగా చంద్రబాబు విఫలం’

రాళ్లతో దాడిచేసి.. బీభత్సం సృష్టించారు!

‘కేంద్ర ప్రభుత్వ నిధులను బాబు దోచుకున్నారు’

ఏమీ చేయలేకపోతే.. గాజులు తొడుక్కో..!!

ఊహాగానాలకు తెరదించిన అమిత్‌ షా!

నవ్వుతున్నారు... థూ.. అని ఊస్తున్నారు!

సభపై ‘గులాబీ’  నజర్‌!

సిగ్గుతో చావండి

వర్లిలో కుమార సంభవమే!

టీడీపీ పొలిట్‌బ్యూరోలోకి కొత్త ముఖాలు

‘కేసీఆర్‌కు భయం పట్టుకుంది’

ఆర్టీసీ ఆస్తులను కాపాడాలని గవర్నర్‌కు విజ్ఞప్తి

‘చంద్రబాబు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు’

యోగికి షాకిచ్చిన బీజేపీ నేత

హుజూర్‌నగర్‌లో రేపు సీఎం కేసీఆర్‌ ప్రచారం

‘కేసీఆర్‌కు 40 సార్లు మొట్టికాయలు’

‘టీడీపీని బీజేపీలో విలీనం చేస్తే బాగుంటుంది’

చంద్రబాబుకు పుట్టుకతోనే ఆ లక్షణాలు..

‘ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు’

చంద్రబాబును దగ్గరకు కూడా రానివ్వం: సత్యమూర్తి

బిడ్డలంటూ సైకోలా కక్ష సాధింపా..

నల్లగొండలో ప్రచార వే‘ఢీ’..!

సావంత్‌ వర్సెస్‌ మహాడేశ్వర్!

‘సూరీ.. నీచ రాజకీయం మానుకో’

టీఆర్‌ఎస్‌ ‘గెలుపు’ లెక్కలు

అక్కడ చక్రం తిప్పినవారికే..!

ఆర్టికల్‌ 370: దేశ, విదేశాల్లో పుకార్లు పుట్టిస్తున్నారు!

వీర్‌ సావర్కర్‌కు భారతరత్న!

సీఎం నన్ను అవమానించారు : గవర్నర్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘బిగ్‌బాస్‌ గారు.. మా ఇంటికి రండి’

బిగ్‌బాస్‌: ‘పాత అలీ కావాలి!’

విక్రమ్‌తో కేజీఎఫ్‌ హీరోయిన్‌?

ఆయన మాత్రమే బాకీ..

బాలు పాట హైలైట్‌

గ్యాంగ్‌స్టర్‌ గంగూభాయ్‌