కన్నడ రాజకీయం : స్పీకర్‌ నిర్ణయంపై ఉత్కంఠ

7 Jul, 2019 17:29 IST|Sakshi

బెంగళూర్‌ : కర్ణాటకలో పాలక కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణ సర్కార్‌ పెను సంక్షోభం ఎదుర్కొంటోంది. రాజీనామా చేసిన ఎనిమిది మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ముగ్గురు జేడీఎస్‌ ఎమ్మెల్యేలు బెట్టువీడకపోవడంతో వారిని బుజ్జగించేందుకు కాంగ్రెస్‌, జేడీఎస్‌ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముఖ్యమంత్రి మార్పు అంశంపైనా జేడీఎస్‌ చీఫ్‌ దేవెగౌడతో కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌ చర్చలు జరిపినట్టు వార్తలు వచ్చాయి. మరోవైపు మరో పది మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రెబెల్‌ ఎమ్మెల్యేల బాట పడతారనే సమాచారం సంకీర్ణ సర్కార్‌ను మరింత ఇరకాటంలోకి నెట్టింది.

రెబెల్‌ ఎమ్మెల్యేల వెనుక కాంగ్రెస్‌ నేత సిద్ధరామయ్య ఉన్నారని కాంగ్రెస్‌ నేతలు కొందరు ఆరోపణలు గుప్పించడం కలకలం రేపుతోంది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బసచేసిన ముంబైలోని సోఫిటెల్‌ వద్ద యూత్‌ కాంగ్రెస్‌ నేతలు ఆందోళనలకు దిగడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఎమ్మెల్యేల రాజీనామాలపై పరిశీలించి ఓ నిర్ణయం తీసుకుంటామని స్పీకర్‌ రమేష్‌ కుమార్‌ ప్రకటించారు.

మరిన్ని వార్తలు