మజ్లిస్‌ శాసనసభాపక్ష నేతగా అక్బరుద్దీన్‌ ఒవైసీ

17 Dec, 2018 04:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మజ్లిస్‌ పార్టీ శాసనసభాపక్షనేతగా చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్‌ దారుస్సలాంలో పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు ఎన్నుకున్నారు. అక్బరుద్దీన్‌ ఒవైసీ శాసనసభాపక్షనేతగా ఎన్నిక కావడం ఇది ఐదోసారి. పార్టీ అధినేత అసదుద్దీన్‌కు సోదరుడైన అక్బరుద్దీన్‌ 1999లో రాజకీయ అరంగేట్రం చేసిన మొద టి పర్యాయమే చాంద్రాయణగుట్ట అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

ఇక్క డ గతంలో వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతి నిథ్యం వహించిన రాజకీయ ప్రత్యర్థి, మజ్లిస్‌ బచావో తెహ్రీక్‌ (ఎంబీటీ) అధినేత మహ్మద్‌ అమానుల్లాఖాన్‌ను ఓడించి అక్బరుద్దీన్‌ మొదటిసారి అసెంబ్లీలోకి ప్రవేశించారు. అప్పటి నుంచి అక్బరుద్దీన్‌ వరుసగా విజయం సాధిస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు 5 సార్లు చాంద్రాయణగుట్ట నుంచి ఎన్నికయ్యారు. ప్రతిసారి ప్రత్యర్థులను చిత్తుచేసి భారీ మెజార్టీ సాధిస్తూ వస్తున్నారు. సమావేశంలో పార్టీ శాసనసభ్యులు అక్బరుద్దీన్‌ ఒవైసీ, అహ్మద్‌ పాషా ఖాద్రీ, ముంతాజ్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా