వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలి

30 Dec, 2017 02:54 IST|Sakshi

ఢిల్లీలో టీఎమ్మార్పీఎస్, మాదిగ జేఏసీ ధర్నా

సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లును కేంద్రం వెంటనే పార్లమెంటులో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ తెలంగాణ ఎమ్మార్పీఎస్, ఏపీ ఎమ్మార్పీఎస్, మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఢిల్లీలో ధర్నా చేపట్టారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని టీఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు ఈటుకు రాజు డిమాండ్‌ చేశారు.

అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని బీజేపీ విస్మరించిందని ఏపీ ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు దండు వీరయ్య విమర్శించారు. ఇచ్చిన హామీమేరకు వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టకపోతే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ధి చెబుతామని నేతలు హెచ్చరించారు.

మరిన్ని వార్తలు