కేజ్రీపై ప్రశంసలతో కాంగ్రెస్‌లో కోల్డ్‌వార్‌..

17 Feb, 2020 10:25 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎంగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన అరవింద్‌ కేజ్రీవాల్‌ను ప్రశంసల్లో ముంచెత్తిన కాంగ్రెస్‌ నేత మిలింద్‌ దియోరాపై ఆ పార్టీ నేత అజయ్‌ మాకెన్‌ మండిపడ్డారు. కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం రాబడులను రూ 60,000 కోట్లకు రెట్టింపు చేసిందని, గత ఐదేళ్లలో రెవెన్యూ మిగులును కొనసాగిస్తోందని దియోరా కేజ్రీ సర్కార్‌పై ప్రశంసలు గుప్పిస్తూ ట్వీట్‌ చేశారు. అయితే దియోరా కాంగ్రెస్‌ పార్టీని వీడాలని, ఆ తర్వాత అర్థ సత్యాలను ప్రచారం చేసుకోవాలని మాకెన్‌ హితవు పలికారు.

ముందుగా మీరు వాస్తవాలను తెలుసుకుని ఆపై ట్వీట్‌ చేయాలంటూ చురకలు అంటించారు. కాంగ్రెస్‌ హయాంలో 2015-16లో ఢిల్లీ రాబడి 14.87 శాతం పెరిగి రూ 41,129 కోట్లకు చేరుకున్న విషయం దియోరా గుర్తెరగాలని సూచించారు. కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌ సారథ్యంలోని ఆప్‌ ఘనవిజయం సాధించగా బీజేపీ ఎనిమిది స్ధానాలకు పరిమితమవగా కాంగ్రెస్‌ ఖాతా తెరవని సంగతి తెలిసిందే.

చదవండి : మఫ్లర్‌మాన్‌ సందడి క్రేజీ

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు