ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు రావాలి

17 Aug, 2018 02:16 IST|Sakshi

     సర్కారుకు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి సవాల్‌ 

     కేసీఆర్, హరీశ్, కేటీఆర్‌లలో ఎవరొచ్చినా ఓకేనని వ్యాఖ్య

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులపై తమతో బహిరంగ చర్చకు రావాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క సవాల్‌ చేశారు. ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్‌ వచ్చినా లేదంటే మంత్రులు హరీశ్, కేటీఆర్‌లు వచ్చినా తాము చర్చకు సిద్ధమన్నారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. ఏ ప్రాజెక్టు వద్దకు రమ్మంటే అక్కడికి వస్తామని, ఇది పార్టీ నిర్ణయమని చెప్పారు. రూ.38 వేల కోట్ల అంచ నా వ్యయంతో తాము ప్రారంభించి రూ.10 వేల కోట్లు ఖర్చు చేసిన డాక్టర్‌. బి.ఆర్‌.అంబేడ్కర్‌ ప్రాణహిత–చేవెళ్లకు మిగిలిన రూ.28 వేల కోట్లు వెచ్చించి పూర్తి చేయాల్సింది పోయి రూ.లక్ష కోట్లకు అంచనాలను ఎలా పెంచారని ప్రశ్నించారు. అంబేడ్కర్‌ పేరుతో ఉన్న ప్రాజెక్టును తాము మార్చలేదని టీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారని, అలాంటప్పుడు కాళేశ్వరం ఎక్క డి నుంచి వచ్చిందని నిలదీశారు. పాత ప్రాజెక్టును తాము మార్చలేదని, అది కొత్త ప్రాజెక్టు కాదని కేంద్రానికి నివేదిక ఎలా పంపారని ప్రశ్నించారు.

ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టు కొత్తది అయితే ప్రాణహి త–చేవెళ్ల ఏమైందని ప్రశ్నించారు. అంబేడ్కర్‌ ప్రాజెక్టును పేరుమార్చి రీడిజైనింగ్‌ చేసి కాళేశ్వరం పేరుతో రూ.లక్ష కోట్లకు అంచనాలు పెంచారని, దీనిపై తాము చర్చకు సిద్ధమని పేర్కొన్నారు. రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్‌ దుమ్ముగూడెం ప్రాజెక్టులు రూ.1,421 కోట్లు ఖర్చు పెడితే పూర్తయ్యేవని, రూ.12 వేల కోట్లకు అంచనాలను పెంచి సీతారామ ప్రాజెక్టును ప్రారంభించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. దీనిపై ఖమ్మం జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చర్చకు వచ్చినా తాము సిద్ధమేనని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల్లో జరుగుతున్న అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్తామని భట్టి చెప్పారు. కాంగ్రెస్‌ నేతలను లుచ్ఛాగాళ్లంటూ ప్రాజెక్టులపై చర్చ జరగకుండా  కేటీఆర్‌ తప్పుదోవ పట్టిస్తున్నా ర న్నారు. కాంగ్రెస్‌ నేతలు ఎందుకు లుచ్ఛాగాళ్లో కేటీఆర్‌ చెప్పాలని, దళితుడిని ముఖ్యమంత్రిని చేయనందుకు, మూడెకరాల భూమి ఇవ్వనందుకు, కేజీ టూపీజీ విద్యను అమలు చేయనందుకు కాంగ్రెస్‌ వాళ్లు లుచ్ఛాగాళ్లా అని ప్రశ్నిం చారు. ఇలాంటి భాషను పత్రికల్లో చదివినందు కు సిగ్గుపడుతున్నానన్నారు.   

మరిన్ని వార్తలు