వైద్యరంగాన్ని నిర్వీర్యం చేస్తున్న లక్ష్మారెడ్డి

7 Apr, 2018 02:59 IST|Sakshi

టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యరంగాన్ని మంత్రి లక్ష్మారెడ్డి నిర్వీర్యం చేస్తున్నారని టీపీసీసీ ఉపా ధ్యక్షుడు మల్లు రవి ఆరోపించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..‘పేదలకు అత్యంత అవసరమైన ప్రభుత్వ వైద్యరంగాన్ని, ఆస్పత్రులను నిర్లక్ష్యం చేస్తున్నారు.

ఉస్మానియాలో రెండు నెలలుగా అత్యవసర ఆపరేషన్లు చేయకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు. ప్రభుత్వం ప్రచారం కోసం బస్తీ దవాఖానా ఏర్పాటు చేస్తామని చెబుతున్నా పెద్ద ఆస్పత్రుల్లోనే మందులు లేవు. ప్రభుత్వ వైద్యాన్ని నీరుగార్చి, ప్రైవేట్‌ కార్పొరేట్‌ ఆస్పత్రులకు లాభం చేకూరే విధంగా మంత్రి లక్ష్మారెడ్డి వ్యవహరిస్తున్నారు’అని విమర్శించారు.

మరిన్ని వార్తలు