వేతనాల జాప్యంపై బదులివ్వండి: మల్లు

5 May, 2018 01:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ధనిక రాష్ట్రమని ప్రగల్భాలు పలుకుతున్న సీఎం కేసీఆర్, ఆర్టీసీ కార్మికుల వేతనాల ఆలస్యంపై సమాధానం చెప్పాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి డిమాండ్‌ చేశారు. శుక్రవారమిక్కడ గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడంతో సమ్మె చేసే వరకు వ్యవహారం ముదిరిందని అన్నారు.

ముఖ్యమంత్రి తన విలాసాలకు వేలాది కోట్లు ప్రజా ధనాన్ని వాడుకుంటున్నారని మండిపడ్డారు. పథకాల ప్రచారానికి కార్మికుల సొమ్మును ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు.

13 నుంచి కాంగ్రెస్‌ మూడో విడత యాత్ర
సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ మూడో విడత బస్సుయాత్రను ఈ నెల 13 నుంచి 17 వరకు చేపట్టనున్నట్లు టీపీసీసీ ప్రకటించింది. ఈ నెల 13న మంచిర్యాల, 14న చెన్నూరు, 15న సిర్పూర్‌ కాగజ్‌నగర్, 16న ఆసిఫాబాద్, 17న బెల్లంపల్లిలో బస్సు యాత్ర చేపట్టనున్నామని పేర్కొంది. ఆయా నియోజకవర్గాల్లో అదే రోజు బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.   

పంట నష్టంపై కమిటీ వేయాలి
ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసిన పొంగులేటి  
సాక్షి, హైదరాబాద్‌: అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి శుక్రవారం డిమాండ్‌ చేశారు. పంట నష్టంపై తక్షణమే కమిటీని ఏర్పాటు చేసి, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలన్నారు.

మరిన్ని వార్తలు