బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

21 Jun, 2018 15:43 IST|Sakshi
ప్రధాని మోదీ.. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా

కోల్‌కతా: తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. భారతీయ జనతా పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో ఆమె మాట్లాడుతూ.. భాజాపాను ఓ ఉగ్రవాద సంస్థగా అభివర్ణించారు. ‘మా పార్టీ(టీఎంసీ పార్టీ) బీజేపీలా కాదు. క్రైస్తవులు, ముస్లింలతోపాటు హిందువుల మధ్య కూడా వాళ్లు(బీజేపీ) చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. బీజేపీ ఓ ఉగ్రవాద సంస్థ. రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలని యత్నిస్తున్నారు’ అంటూ మమతా వ్యాఖ్యానించారు. గత కొన్ని నెలలుగా బెంగాల్‌లో బీజేపీ-టీఎంసీ కార్యకర్తల మధ్య దాడులు-ప్రతిదాడులు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. కార్యకర్తల అనుమానాదాస్పద మృతులతో ఇరు పార్టీలు ‘రాజకీయ హత్యలు’గా పరస్పరం ఆరోపించుకుంటున్నాయి. 

ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్‌ బీజేపీ చీఫ్‌ దిలీప్‌ ఘోష్‌ టీఎంసీ పార్టీ నేతలను, కార్యకర్తలను బెదిరించారు. గతవారం జల్‌పైగురిలో నిర్వహించిన ఓ నిరసన ప్రదర్శన సందర్భంగా ‘రౌడీయిజానికి పాల్పడితే టీఎంసీ కార్యకర్తలను అరెస్ట్‌ చేయిస్తానని, ఎన్‌కౌంటర్‌ చేయిస్తానని’ దిలీప్‌ బహిరంగంగా వ్యాఖ్యాలు చేశారు. ఈ నేపథ్యంలోనే మమతా ఇలా తీవ్రంగా స్పందించారు. మరోపక్క తీవ్ర వ్యాఖ్యలకుగానూ దిలీప్‌ క్షమాపణలు చెప్పినప్పటికీ, టీఎంసీ నేతల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

                                                మమతా బెనర్జీ.. దిలీప్‌ ఘోష్‌

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు