వైఎస్‌ జగన్‌కు మమతా బెనర్జీ శుభాకాంక్షలు

29 May, 2019 23:11 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణస్వీకారం చేస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు అభినందనలు తెలుపుతూ ఆమె ట్విట్టర్‌లో తన సందేశాన్ని బుధవారం పోస్ట్‌ చేశారు.

సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించినప్పటి నుంచి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు వివిధ వర్గాల ప్రజల నుంచి వెల్లువెలా అభినందనలు వస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రేపు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని కనులారా వీక్షించేందుకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున వైఎస్సార్‌ సీపీ శ్రేణులు తరలి వెళ్తున్నాయి. ఆయనను సీఎంగా చూడాలని గత ఎనిమిదేళ్లుగా అహర్నిశలూ కష్టపడిన పార్టీ కార్యకర్తలు.. ఆ సమయం రావడంతో విజయవాడకు భారీగా పయనమవుతున్నారు. ప్రమాణ స్వీకారాన్ని దగ్గరుండి చూడాలని ఆత్రుత కనబరుస్తున్నారు. ఆమేరకు ఏర్పాట్లు చేసుకున్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు