నా ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారు : మమత

3 Nov, 2019 11:37 IST|Sakshi

కోల్‌కతా : తన ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఫోన్‌ ట్యాంపింగ్‌ చేశారనడానికి తన వద్ద ఆధారాలు ఉన్నాయని ఆమె తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా  కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. మెబైల్‌ ఫోన్ల నుంచి సమాచారం సేకరించడం తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని ఆమె అభిప్రాయపడ్డారు. ఛత్‌ పూజా సందర్భంగా కోల్‌కతాలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడారు. తన ఫోన్‌ ట్యాప్‌ చేసినట్లు గతంలో చాలాసార్లు చెప్పానని.. ఇది పూర్తిగా భద్రతను అతిక్రమించడమేనని వ్యాఖ్యానించారు. ఇది వ్యక్తిగత స్వేచ్ఛ మీద దాడి అని విమర్శించారు. దీంతో మనం ఎవరితో స్వేచ్ఛగా మాట్లాడలేమని అన్నారు.

అలాగే చాలా మంది ప్రముఖల వ్యక్తిగత సమచారం చోరీకి గురవుతుందని ఆరోపించారు. పలువురు జర్నలిస్టుల, లాయర్ల వ్యక్తిగత సమాచారం వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా తస్కరణకు గురైందని ఆ సంస్థల అధికారులు అంగీకరించిన సంగతి తెలిసిందే. ఇందులో కేంద్ర ప్రభుత్వ ప్రమేయం ఉందని కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మమతా ఈ మేరకు స్పందించారు.

మరిన్ని వార్తలు