సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ దీదీ బరిలోకి

8 Mar, 2019 14:20 IST|Sakshi

మార్చి 8న మమతా బెనర్జీ ఎన్నికల ర్యాలీ  షురూ


సాక్షి, కోలకతా :  పశ్చిమ  బెంగాల్‌ ముఖ్యమంత్రి, త్రిణమూల్‌  కాంగ్రెస్‌ అధినేత మమతా బెనర్జీ  ఎన్నికల సమరంలోకి దిగిపోయారు. శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా కోలకతాలో  ప్రచార కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా ఎన్నికల తేదీలు ప్రకటించనప్పటికీ,  తన పాత సాంప్రదాయాన్ని పాటిస్తూ,  మార్చి 8న  శ్రద్ధానంద పార్క్ నుంచి పాదయాత్ర (ర్యాలీ) ప్రారంభించారు. భారతీయ సమాజానికి మహిళలే  వెన్నెముక అనీ మహిళల సాధికారతకు తమ ప్రభుత్వం కట్టుబడి వుందంటూ దీదీ ట్వీట్‌ చేశారు.  ప్రపంచంలోని మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందజేశారు.

కొత్త భారతదేశం, ఐక్య భారతదేశం  బలమైన భారతదేశాన్ని సృష్టించడమే ఈ ర్యాలీ ఉద్దేశమని  పార్టీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.  ఈ మేరకు కోలకతా వీధుల్లో  పోస్టర్లు కూడా వెలిసాయి.  2014, 16  సంవత్సరాల్లో మార్చి 8వ తేదీనే దీదీ ఎన్నికల ప్రచార సంరేశాన్నిస్తారనీ, పార్టీ సీనియర్‌ ప్రతినిధి ఒకరు  వెల్లడించారు. తేదీలు ప్రకటించిన తరువాత, పూర్తిస్థాయి ప్రచారం ప్రారంభమవుతుందని  పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు