సుమలతను గెలిపించండి: మోహన్‌ బాబు

17 Apr, 2019 21:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రముఖ నటుడు అంబరీష్‌ సతీమణి, నటి సుమలతను భారీ మెజార్టీతో గెలిపించాలని వైఎస్సార్‌సీపీ నేత, నటుడు మంచు మోహన్‌బాబు మండ్య ప్రజలను కోరారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌ వేదికగా సుదీర్ఘ పోస్ట్‌ చేశారు.

‘కర్ణాటక ప్రజలందరికీ.. మండ్య ప్రజలు, అభిమానులకు ప్రత్యేకంగా.. మన అభిమాన నటుడు, ప్రజల మనిషి, గొప్ప వ్యక్తిత్వం గల నటుడు అంబరీష్‌. మండ్యప్రజల సంక్షేమం కోసం నిరంతరం పరితపించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేశారు. ఇవన్నీ మనకు తెలుసు. ఇప్పుడు మనందరి బాధ్యత ఆ గొప్ప వ్యక్తి సతీమణి సుమలతకు అండగా నిలబడటం. మీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి సుమలత స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగింది. మీ అందరి ఆశీస్సులు సుమలతకు ఉంటాయని, ఆమెను భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. అంబరీష్‌తో పాటు నేను కూడా మిమ్మల్ని ప్రేమించాను. మండ్య ప్రజలు సహృదయం కలవారు. వారందరికి నా నమస్కారాలు.

చంద్రబాబు నాయుడు ఒకప్పటి ఆంధ్రప్రదేశ్‌ సీఎం. ఇప్పుడు కాదు.. ఇక ఎప్పటికీ కారు. మంచి మనస్సు గల అంబరీష్‌.. చంద్రబాబు నా ద్వారా పిలిచిన చాలా కార్యక్రమాలకు హాజరయ్యారు. కానీ చంద్రబాబుకు ఏమాత్రం కృతజ్ఞతాభావం లేదు. అతని కోసం అంబరీష్‌ చాలా చేశారు. అలాంటి అతని భార్యను ఓడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. సుమలతకు వ్యతిరేకంగా చంద్రబాబు ప్రచారం చేయడం హాస్యాస్పదకం.. ఆశ్చర్యకరం. కులం, డబ్బు రాజకీయాలను పక్కనబెట్టి సుమలతను గెలిపిస్తారని ఆశీస్తున్నాను.’ మోహన్‌బాబు పేర్కొన్నారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు