కేసీఆర్‌కు మళ్లీ అధికారమిస్తే ప్రజాస్వామ్యానికి భంగమే

9 Sep, 2018 02:01 IST|Sakshi

మంద కృష్ణమాదిగ

హైదరాబాద్‌: ఇచ్చిన మాటను ఒక్క శాతమైనా నిలబెట్టుకోని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను ప్రజలు మళ్లీ దీవించి అధికారం అప్పగిస్తే పౌరహక్కులు, ప్రజాస్వామ్యానికి భంగం వాటిల్లుతుందని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్ని కల్లో హుస్నాబాద్‌ నుంచి ప్రచారం ప్రారంభించిన కేసీఆర్‌ లక్ష ఎకరాలకు నీళ్లు తెస్తానంటూ ప్రకటించిన వీడియోను ప్రదర్శించారు.

నీళ్లిస్తామన్న హామీని నెరవేర్చలేదన్నారు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని రాయకీయ నాయకులకు ఇచ్చే ప్రాధాన్యతను ప్రజాసమస్యలపై పోరాడే ప్రజాసంఘాలకు ఇవ్వా లని మీడియా యాజమాన్యాలను ఉద్దేశించారు. నవంబర్‌ 11న కొంగర్‌ కలాన్‌లో భారీ సభ నిర్వహిస్తామని కృష్ణమాదిగ ప్రకటించా రు. తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకుసుధాకర్‌ మాట్లాడుతూ, ‘రాష్ట్రంలో ప్రగతి లేదు. మాయా ప్రపంచం రాజ్యమేలుతోంది’ అని అన్నారు. సమావేశంలో బీసీ సంఘాల జేఏసీ చైర్మన్‌ ఓరుగంటి వెంకటేశంగౌడ్, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు