చంద్రబాబుపై మందకృష్ణ ఫైర్‌

27 Mar, 2019 14:08 IST|Sakshi

సాక్షి, విజయవాడ : సీఎం చం‍ద్రబాబు నాయుడు మాదిగలను నమ్మించి మోసం చేశారని ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో విశ్వరూప మహాసభకు అనుమతి నిరాకరణను ఖండిస్తున్నామని తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ... మాదిగలకు నమ్మకద్రోహం చేసిన చంద్రబాబుకు ఓటు ద్వారా రాజకీయ శిక్ష వేస్తామని పేర్కొన్నారు. సీట్ల కేటాయింపులో టీడీపీ మాలలకే పెద్ద పీట వేసిందని మండిపడ్డారు. దళితులు విషయంలో నిర్లక్ష్యం చూపుతున్న చంద్రబాబును.. రానున్న ఎన్నికల్లో గద్దె దించి తగిన బుద్ధి చెపుతామని హెచ్చరించారు. ఈనెల (మార్చి) 29న తమ రాజకీయ భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని మందకృష్ణ తెలిపారు.

కాగా టీడీపీ హయాంలో దళితులు తీవ్ర అవమానాలకు గురైన సంగతి తెలిసిందే. ‘ఎవరైనా దళితులుగా పుట్టాలని కోరుకుంటారా’ అంటూ ఏకంగా సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేయగా.. ‘దళితులు మీకెందుకు రా రాజకీయాలు’ అంటూ ఆ పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అసభ్యకర పదజాలంతో దూషించారు. ఈ విధంగా అధికార పార్టీ అహంకారానికి తార్కాణంగా నిలిచిన ఘటనలు ఇంకెన్నో ఉన్నాయి.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు