చీటర్‌ బాబుకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారు

27 May, 2019 03:11 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న మందకృష్ణ

మందకృష్ణ మాదిగ విమర్శ

హైదరాబాద్‌: ఆంధ్ర ప్రదేశ్‌లోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన చంద్రబాబు నాయుడు నంబర్‌ వన్‌ చీటర్‌ అని, అందుకే ప్రజలు తగిన రీతిలో ఆయనకు బుద్ధి చెప్పారని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ధ్వజమెత్తారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఎమ్మార్పీఎస్‌ కేంద్ర కార్యాలయంలో విలేకరుల తో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హమీలను చంద్రబాబు విస్మరించడంతో ఎమ్మార్పీఎస్‌ టీడీపీని ఓడించడమే లక్ష్యంగా పనిచేసింద న్నారు.

చంద్రబాబు మోసాలతో మాదిగ పల్లెలు ఆ పార్టీకి దూరమైనాయని తెలిపారు. వైఎస్‌ జగన్‌ ఎస్సీ వర్గీకరణ పట్ల మౌనంగా ఉండ టంతో తమ వర్గ ప్రజలకు నోటాకు ఓటు వేయా లని ప్రచారం చేశామని, అయినా టీడీపీపై ఉన్న కోపంతో వారు వైఎస్సార్‌ సీపీకి ఓటు వేశారని తెలిపారు. ఈ నెల 27, 28 తేదీలలో చిత్తూరు జిల్లా హార్సిలీహిల్స్‌లో జాతీయ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న వైఎస్‌ జగన్‌కు శభాకాంక్షలు తెలిపారు.
 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా