‘మాదిగ జాతిని అంతం చేసే కుట్రలు జరుగుతున్నాయి’

19 Sep, 2018 13:47 IST|Sakshi

సాక్షి, మంచిర్యాల: నల్లాల ఓదెలుకు టికెట్‌ రాలేదనే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డ గట్టయ్య మృతదేహానికి బుధవారం ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గట్టయ్య మృతికి టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. ఆందోల్‌లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే బాబు మోహన్‌ టికెట్‌ను.. ఒక జర్నలిస్టు అయిన మరో మాల వ్యక్తికే ఇచ్చారని తెలిపారు. కానీ చెన్నూరులో మాత్రం ఎమ్మెల్యేగా ఉన్న మాదిగ వ్యక్తి ఓదెలు టికెట్‌ను మాత్రం మాల వ్యక్తి ఒక ఎంపీగా ఉన్న బాల్క సుమన్‌కు కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీఆర్‌ఎస్‌ పాలనలో మాదిగ జాతిని అంతం చేసే కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ పాలనలో అక్రమాలు, అవినీతి చేసిన సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను కొనసాగించి.. నీతిగా న్యాయంగా కొనసాగిన మాదిగ బిడ్డ ఓదెలుకు టికెట్‌ నిరాకరించడంపై మండిపడ్డారు. కేసీఆర్‌ చేసిన సర్వేలో 78 శాతంతో ఓదెలు ముందన్న టికెట్‌ నిరాకరిస్తూ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు తెలుపాలని కోరారు. ఈ నెల 12న ఇందారంలో జరిగిన టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రచార ర్యాలీ, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన గట్టయ్య(35) 80శాతం కాలిన గాయాలతో హైదరాబాద్‌ మలక్‌పేట్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం 2.20 గంటలకు మృతి చెందిన సంగతి తెలిసిందే. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వివేకా మృతి విషయం తెలిసి ‘పరవశించా!’

అభ్యర్థులను ప్రకటించిన డీఎంకే, అన్నా డీఎంకే

రాష్ట్రాభివృద్ధికి బాబు చేసింది శూన్యం

ప్రచారంలో చినబాబుకు చుక్కలు

గుంటూరు జిల్లాలో యథేచ్ఛగా కోడ్‌ ఉల్లంఘన

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అంతకు మించి...

మ్యాడసన్‌ @ సైలెన్స్‌

వేసవిలో క్రైమ్‌ కామెడీ

మా సినిమా యూత్‌కు మాత్రమే

ఎవరికీ చెప్పొద్దు!

నువ్వు మాస్‌రా...