కేసీఆర్‌ ఫాం హౌస్‌లో ఏం జరుగుతోంది?

18 Oct, 2019 09:45 IST|Sakshi
మాట్లాతున్న మంద కృష్ణమాదిగ

కానిస్టేబుల్‌ ఆత్మహత్యపై విచారణ జరిపించాలి

ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ

సాక్షి, హన్మకొండ: సీఎం కేసీఆర్‌ ఫాం హౌస్‌లో ఏం జరుగుతోందనే విషయాన్ని తెలుసుకునేందుకు హెడ్‌కానిస్టేబుల్‌ ఆత్మహత్యపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేపట్టాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్‌ చేశారు. హన్మకొండలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ ఫాం హౌస్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకటేశ్వర్లు మద్యం మత్తులో ఆత్మహత్య చేసుకున్నాడని ఏసీపీ ఎలా ప్రకటిస్తారన్నారు. ఫాం హౌస్‌లోకి మద్యం సే వించి ఒక కానిస్టేబుల్‌ ఎలా వెళ్లగలడని ప్రశ్నించారు.

పోలీసు అధికారుల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నా ఎందుకు విచారణ చేయించడం లేదని అన్నారు. కాగా, ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఈనెల 19న తలపెట్టిన రాష్ట్ర బంద్‌ను ప్రజలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చా రు. హంటర్‌ రోడ్డులోని ఆర్టీసీ స్థలం లీజ్‌ రద్దు చేసుకోవాలని, దొరలకు బినామీగా కాకుండా ప్రజల మనిషిగా ఉండాలని వరంగల్‌ ఎంపీ దయాకర్‌కు సూచించారు. లీజును వదులుకోకపోతే ఆర్టీసీ ఆస్తుల పరిరక్షణ ఉద్యమం వరంగల్‌ నుంచే మొదలు పెడుతానని స్పష్టం చేశారు. ఎమ్మెస్పీ జాతీయ అ«ధికార ప్రతినిధి తీగల ప్రదీప్‌గౌడ్, ఎమ్మార్పీఎస్‌ నాయకుడు బొడ్డు దయాకర్, ఆర్టీసీ కార్మిక సంఘం నాయకులు కుమ్మరి రాజయ్య, వేణు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు