కేసీఆర్‌ మళ్లీ వస్తే ప్రజాస్వామ్యం ఖూనీ

6 Sep, 2018 05:20 IST|Sakshi

ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ

హైదరాబాద్‌: వచ్చే ఎన్నిక ల్లో కేసీఆర్‌కు మళ్లీ పట్టం కడితే ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ఖూనీ చేస్తారని, ఇప్పటికే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదకర ‡పరిస్థితుల్లో ఉందని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ విమర్శించారు. నిరుద్యోగులు, విద్యార్థు లు, మహిళలు, దళితులందరికీ అన్యాయం చేసిన సీఎంకు తిరిగి ఆశీర్వదించమని అడిగే నైతికహక్కు ఉందా? అని ప్రశ్నించారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్‌ మోసాలు, వైఫల్యాలు, అణచివేతలపై కొంగరకలాన్‌లోనే నవంబర్‌ 6న ‘ప్రజా ఆగ్రహ సభ’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభకు బీజేపీ, టీఆర్‌ఎస్‌ మినహా దేశంలోని అన్ని పార్టీల ప్రధాన నాయకులను పిలవనున్నట్లు చెప్పారు. ఈ సభ సన్నాహకాల్లో భాగంగా ఈ నెల 9న ఎమ్మార్పీఎస్‌ జాతీయస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. టీఆర్‌ఎస్‌ అత్యంత పెద్ద సభగా ప్రకటించుకున్న వరంగల్‌ సభకు 10 నుంచి 15 లక్షలు వరకు ప్రజలు రాగా,  కొంగర్‌కలాన్‌ సభకు  5 లక్షల మంది రాలేదన్నారు. 

మరిన్ని వార్తలు