యుద్ధవిమానాల కొనుగోళ్లలో భారీ కుంభకోణం?

25 Jul, 2018 15:26 IST|Sakshi

హైదరాబాద్‌: రాఫెల్‌ ఫ్రెంచ్‌ యుద్ధ విమానాల కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ..వీటి కొనుగోళ్లలో అనేక అనుమానాలున్నాయని అన్నారు. తాను కూడా ఓ పైలట్‌నేనని, యుద్ధ విమానంలో ట్రైనర్‌ని అని, చైనా, పాకిస్తాన్‌ సరిహద్దులో కూడా పనిచేశానని వ్యాఖ్యానించారు. యుద్ధ విమాన పరికరాల ధరలు తెలపడం వల్ల దేశభద్రతకు ఎటువంటి ముప్పు ఉండదని తెలిపారు. ప్రధాన మంత్రి , రక్షణ శాఖా మంత్రి ధరలు సీక్రెట్‌ అని చెప్పడం కరెక్ట్‌ కాదని అన్నారు. ఆపరేషన్‌ వివరాలు మాత్రమే సీక్రెట్‌ ఉండాలని చెప్పారు.

ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్య ధరపై స్పష్టత ఇచ్చినట్లే మిగతా వాటి వివరాలు కూడా వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. గతంలో యుద్ధ సామగ్రి కొనుగోలు చేసేటప్పుడు సీక్రెట్‌ మెయింటేన్‌ చేయలేదని..మరి ఇప్పుడు అంత సీక్రెట్‌గా ఉంచాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. అనిల్‌ అంబానీకి ట్రాన్స్పర్‌ చేయడంలో మతలబు ఏమిటి..? అనిల్‌ అంబానీ ఎప్పుడు డిఫెన్స్‌ సామగ్రి విభాగంలో లేడు..హెచ్‌ఏఎల్‌ కంపెనీతో నరేంద్ర మోదీ ప్రధాని కాకముందే నుంచే ఒప్పంద ఉంది..అయినా సరే హెచ్‌ఏఎల్‌ కంపెనీని కాదని అనిల్‌ అంబానీ కంపెనీకి ఇవ్వడం వెనక మతలబేంటని ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా