చంద్రబాబుకు షాకిచ్చిన అఖిలేశ్‌, మయావతి

10 Dec, 2018 17:40 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్ని ఏకతాటిపైకి వస్తాయని ఆశించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం ఢిల్లీలో జరిగిన విపక్షాల సమావేశానికి యూపీలో బలమైన నేతలు అఖిలేశ్‌, ములాయం సింగ్‌ యాదవ్‌, మయావతిలు డుమ్మా కొట్టారు. తొలి నుంచి తనవల్లే విపక్షాలు ఏకమవుతన్నాయని అనుకూల మీడియా ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం చేయించుకున్న చంద్రబాబుకు జాతీయస్థాయిలో ఏపాటి స్థానం ఉందో ఈ సంఘటనతో తెటతెల్లమయిందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు స్వయంగా ఇంటికి వెళ్లి పిలిచినా కూడా మయావతి, అఖిలేశ్‌లు ఆయన విజ్ఞప్తికి స్పందించలేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.

మోదీని ఎదుర్కొవాలంటే లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష పార్టీలు మెజారిటీ స్థానాల్లో విజయం సాధించాల్సిన అవసరం ఉంది. ఈ లెక్కన అత్యధిక లోక్‌సభ స్థానాలు ఉన్న యూపీలో విపక్షాల సాధించే స్థానాలు కీలకం కానున్నాయి. కానీ అక్కడ ప్రధాన పార్టీలుగా ఉన్న బీఎస్పీ, ఎస్పీలు నేడు జరిగిన సమావేశానికి దూరంగా జరగడంతో.. మోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నింటినీ ఒక్కతాటిపైకి రావడం సాధ్యమేనా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఉత్తర భారత్‌లోని కొన్ని రాష్ట్రాల్లో కూడా బీఎస్పీ కొంతమేర ఓటు బ్యాంక్‌ కలిగి ఉంది.

సమావేశానికి హాజరైన బీజేపీయేతర పార్టీలు
కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలో జరిగిన విపక్షాల సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి 14 బీజేపీయేతర పార్టీల నాయకులు హాజరయ్యారు. బీజేపీ హయాంలో రాజ్యాంగ వ్యవస్థల దుర్వినియోగంపై వీరు చర్చించుకున్నారు. పార్లమెంట్‌ లోపల, బయట కలిసి పనిచేయాలనే నిర్ణయం తీసుకున్నారు. బీజేపీని గద్దెదించేందుకు ఉమ్మడి కార్యచరణతో ముందుకెళ్లాలని నిర్ణయానికి వచ్చారు. ఈ సమావేశానికి గైర్హాజరు అయిన ఎస్పీ, బీఎస్పీలు తమతో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశానికి హాజరైన నేతలు:
1. గులాం నబీ ఆజాద్
2. అహ్మద్ పటేల్
3. రాహుల్‌ గాంధీ
4. బద్రుద్దిన్ అజ్మల్ (ఏఐడీయూఎఫ్‌)
5. సీతారాం ఏచూరి (సీపీఎం)
6. చంద్రబాబు నాయుడు
7. ఫరూక్ అబ్దుల్లా
8. ప్రఫుల్ పటేల్
9. శరద్ పవార్
10. శరద్ యాదవ్
11. అశోక్ గెహ్లాట్
12. కనిమొజి
13. స్టాలిన్‌
14. మమతా బెనర్జీ
15. అరవింద్ కేజ్రీవాల్
16. తేజస్వి యాదవ్
17. సంజయ్ సింగ్
18. ఎకే ఆంథోనీ
19. హెచ్‌డీ దేవేగౌడ
20. మన్మోహాన్ సింగ్
21. డి రాజా
22. ఎలంగోవన్‌ (డీఎంకే)
23. జితేన్‌ రామ్‌ మాంఝీ
24. హేమన్ సోరెన్
25. మజిద్ మేమోన్

మరిన్ని వార్తలు