చంద్రబాబుపై హోంమంత్రి సుచరిత ఫైర్

12 Jun, 2020 14:49 IST|Sakshi

సాక్షి, గుంటూరు : అచ్చెన్నాయుడు అరెస్టుపై టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై హోశాఖ మంత్రి మేకతోటి సుచరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడు అక్రమాలకు పాల్పడితే తనను రాజీనామ చేయమనడం ఎంటో చంద్రబాబుకే తెలియాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఎందుకిలా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఈఎస్‌ఐలో భారీ స్కాం జరిగిందనేది వాస్తవమన్నారు. ఆధారాలతో సహా దొరికాకనే అవినీతిపరులను ప్రభుత్వం అరెస్టు చేస్తోందన్నారు. (అచ్చెన్నాయుడు అరెస్టు; చింతమనేని హైడ్రామా)

విశాఖలో డాక్టర్‌ సుధాకర్‌ కేసులో దళితులపై దాడి అన్నారు. ఇప్పుడు అచ్చెన్నాయుడిని అరెస్టు చేస్తే బీసీలపై దాడి అంటున్నారని బాబు వ్యాఖ్యలను మండిపడ్డారు. ఇలా కుల రాజకీయాలు చేయడం చంద్రబాబుకే చెల్లుతుందని ధ్వజమెత్తారు. లక్ష రూపాయలు విలువ చేసే సోఫాని రూ. 10 లక్షలకు కొనుగోలు చేసిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే చెల్లుతుందని విమర్శలు గుప్పించారు. ఈఎస్‌ఐ స్కాంలో జరిగిన అవినీతి మొత్తాన్ని బయటపెడతామన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని అరెస్టులు కూడా ఉంటాయని పేర్కొన్నారు. అచ్చెన్నాయుడిని కిడ్నాప్‌ చేశారనటం చంద్రబాబు అవివేకానికి నిదర్శనమని హోమంత్రి సుచరిత అన్నారు. (ఏపీలో మరో 141 పాజిటివ్‌ కేసులు)

ఈఎస్‌ఐలో భారీ అవినీతి జరిగింది
గత ప్రభుత్వ హయాంలో ఈఎస్‌ఐలో భారీ అవినీతి జరిగిందని మంత్రి శంకర్‌నారాయణ అన్నారు.  సరైన ఆధారాలతో అచ్చెన్నాయుడును అరెస్ట్ చేశారన్నారు. ఈఎస్ఐలో అవినీతిపై విజిలెన్స్‌, ఏసీబీ పక్కా ఆధారాలు సేకరించారని, అచ్చెన్నాయుడు కార్మిక మంత్రిగా టెండర్లు లేకుండా తన బినామీలకు కట్టబెట్టారన్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన లక్షల కోట్ల అవినీతిలో ఇదొక ఉదాహరణ అని పేర్కొన్నారు. కార్మికుల పొట్ట కొట్టి రూ.151 కోట్ల అవినీతి చేశారని మండిపడ్డారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో బీసీలకు చేసిందేమీలేదని, సీఎం జగన్‌ ఏడాదిలోనే రూ. 42 వేల కోట్ల సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. 

బీసీలకే దాదాపు రూ.20 వేల కోట్ల సంక్షేమ పథకాలు అందాయని, అవినీతిపరుడిని చంద్రబాబు వెనకేస్తుకొస్తున్నారన్నారు. చంద్రబాబు అవినీతిపరుడిని కులానికి అంటగడుతున్నారు. సీఎం జగన్‌ ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేశారని ప్రశసించారు. గతంలో సమస్యలు చెప్పుకోవడానికి వస్తే తోకలు కత్తిరిస్తానని చంద్రబాబు బెదిరించారురని, బీసీలను ఓటు బ్యాంక్‌గానే చూశారు కానీ.. చేసిందేమీలేదని మంత్రి శంకర్‌నారాయణ వ్యాఖ్యానించారు.

>
మరిన్ని వార్తలు