‘అందుకే చింతమనేని అంటే చంద్రబాబుకు భయం’

22 Feb, 2019 14:14 IST|Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి : తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను అచ్చు వేసిన ఆంబోతులా వదిలేసి తమపై అక్రమంగా కేసులు పెడతారా అంటూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున విరుచుకుపడ్డారు. కోట్ల రూపాయల అవినీతి అందించాడు గనుకే చింతమనేని అంటే చంద్రబాబుకు భయమని అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దళితులపై చింతమనేని వ్యాఖ్యలు దారుణమన్నారు. దళితులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన చింతమనేనిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.  దళిత కార్మికుడు రాచేటి జాన్‌ను గతంలో ఇంటికి పిలిచి మరీ కొట్టినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదన్నారు. చింతమనేని దళితులను బూతులు తిడితే ప్రభుత్వం కళ్లు మూసుకుందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చింతమనేని మాట్లాడిన దానినే దళిత నేత కత్తుల రవి షేర్ చేస్తే మార్ఫింగ్ చేశారని తప్పుడు కేసులు పెడతారా అంటూ మండిపడ్డారు. దళితులకు అన్యాయం జరిగితే ఎస్సీ కమీషన్ ఛైర్మన్‌ కారెం శివాజీ ఏం చేస్తున్నారు.. దళితులంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకంత చులకన అని ఆవేదన వ్యక్తం చేశారు. 40 పేజీలపై సంతకాలు తీసుకుని రవిని భయపెట్టాలని చూశారన్నారు. రవిపై పెట్టిన కేసులను వెంటనే తొలగించాలని, చింతమనేనిని అరెస్ట్ చేయకపోయినా.. రవిపై కేసులు ఎత్తివేయకపోయినా ఈ అన్యాయంపై రాష్ట్రంలోని ప్రతీ గడపా తడతామని తేల్చిచెప్పారు. చంద్రబాబు దళిత ద్రోహిగా మిగలబోతున్నాడన్నారు. ‘వంద కోట్ల రూపాయల అంబేద్కర్ స్మృతివనం ఏం చేశావు.. కారెం శివాజీ! చంద్రబాబు దగ్గర ఎస్సీ కమీషన్‌ను తాకట్టు పెట్టి నపుంసకుడిగా ఉండిపోయావ్’ అంటూ విమర్శించారు. ప్రభుత్వాలు మారుతుంటాయని, పోలీసులు న్యాయం పక్షాన ఉండాలని చెప్పారు. కానీ ఏపీలో పోలీసులు చంద్రబాబు మనుషులుగా మారడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రియాంక గాంధీ అయితే ఓకే..

విశ్వాస పరీక్షలో చేతబడిపై చర్చ

కండీషన్స్‌ లేకుండా బీజేపీలో చేరుతా..

పార్లమెంట్‌ సమావేశాలు మూడు రోజులు పొడగింపు!

కర్ణాటకం : విశ్వాస పరీక్షకు మరో డెడ్‌లైన్‌

చిరంజీవి మమ్మల్ని సంప్రదించలేదు..

ప్రియాంక గాంధీని అడ్డుకున్న అధికారులు..!

ప్రతిపక్షం తీరు కుక్కతోక వంకరే: సీఎం జగన్

‘కర్నాటకం’లో కొత్త మలుపు

‘షరతులకు లోబడి లేకపోతే చర్యలు’

‘అప్పటి నుంచి మైండ్‌ మరింత దెబ్బతిన్నట్టుంది’

యడ్యూరప్ప చేతులు జోడించి వేడుకున్నారు కానీ..

పోలవరంపై టీడీపీకి మాట్లాడే హక్కు లేదు

‘అది తప్పుడు ప్రచారం; ప్రజల దృష్టికి తీసుకెళ్లండి’

‘బాబు స్వార్ధం కోసం సభను వాడుకుంటున్నారు’

కర్నాటకం; అసెంబ్లీలోనే భోజనం, నిద్ర

'అధ్యక్షా.. మమ్మల్ని వెనుకబెట్టారు'

‘నన్నెవరూ కిడ్నాప్‌ చేయలేదు’

మాకు ప్రతిపక్ష హోదా కల్పించండి

‘బీజేపీలో ఎప్పుడు చేరేది త్వరలోనే చెబుతా’

కాంగ్రెస్‌లో ‘కంగాళీ’

కర్నాటకం క్లైమాక్స్‌ నేడే

సభ సంకేతాలతో నడుస్తోంది 

నిలబెట్టుకోలేక నిందలా!

కుమారస్వామికి గవర్నర్‌ డెడ్‌లైన్‌

‘సీఎం జగన్‌ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు’

బీజేపీలో నాకు తలుపులు మూసుకుపోలేదు..

బీజేపీలో చేరిన 13 మంది సెలబ్రిటీలు!

కేటీఆర్‌.. మీతో ఛాయ్‌ కా, ఇంకేమైనా ఉందా?

కర్ణాటకం : విశ్వాస పరీక్ష రేపటికి వాయిదా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విడిపోయినంత మాత్రాన ద్వేషించాలా?!

‘రారా.. జగతిని జయించుదాం..’

‘ఆ సెలబ్రిటీతో డేటింగ్‌ చేశా’

ఎన్నాళ్లయిందో నిన్ను చూసి..!!

మహేష్‌ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా..

‘నా ఇష్టసఖి ఈ రోజే పుట్టింది’