‘వాళ్లు చిన్నపిల్లల్లా పారిపోయారు’

30 Mar, 2018 15:37 IST|Sakshi

సాక్షి, యాదాద్రి: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా కాంగ్రెస్ నేతలు చిన్న పిల్లల్లా పారిపోయారని మంత్రి జగదీష్‌ రెడ్డి విమర్శించారు. ఆయన శుక్రవారం యాదాద్రిలో మీడియాతో మాట్లాడుతూ.. విద్యుత్ శాఖ అప్పుల ఊబిలో ఉందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి కానీ రైతులకు 24 గంటల విద్యుత్ ఇవ్వడానికే ఈ అప్పులని స్పష్టం చేశారు.

రైతులను బలోపేతం చేయడానికే రైతు సమన్వయ సమితిల ఏర్పాటు చేశమన్నారు. 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను మూడేళ్ళలోనే నెరవేర్చామని తెలిపారు. అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని ఆయన వెల్లడించారు.


అవి టీఆర్‌ఎస్‌ సమావేశాలు: ​కాంగ్రెస్‌
అసెంబ్లీ సమావేశాలను టీఆర్‌ఎస్‌ పార్టీ సమావేశాలుగా నిర్వహించారని సీఎల్పీ ఉపనేత సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. పంచాయితీ చట్టం మార్పుల ద్వారా గ్రామ సభలకు కోరలు తీసేసి కలెక్టర్లకు అధికారాలు కట్టబెట్టారన్నారు. ప్రైవేటు యూనివర్సిటీలను తీసుకురావడం కార్పొరేట్‌ను ప్రోత్సహించడమేనని తెలిపారు. కాగ్‌ రిపోర్ట్‌ కేసీఆర్‌ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదన్నారు. రాష్ట్రంలో ఆర్థిక నియంత్రణ లేదని రిపోర్టు స్పష్టం చేసిందన్నారు.
 

మరిన్ని వార్తలు