‘ఈ కుట్రలో ఆయనకు భాగం ఉంది’

6 Mar, 2019 20:12 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని భర్తరఫ్‌ చేయాలని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గవర్నర్‌ నరసింహన్‌ను కోరటం విడ్డూరంగా ఉందని మంత్రి కేఎస్‌ జవహార్‌ వ్యాఖ్యానించారు. గవర్నర్‌ వ్యవస్థపై తమకు నమ్మకం లేదన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రజలు బీజేపీ నేతల మాటలు నమ్మరన్నారు. గవర్నర్‌కు కూడా ఈ కుట్రలో భాగం ఉందని ఆరోపించారు. గవర్నర్‌ వ్యవస్థను ప్రధాని నరేంద్రమోదీ దుర్వినియోగం చేశారన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా