ఏయ్‌.. నీ అంతు చూస్తా : కాలవ శ్రీనివాసులు

27 Aug, 2018 11:13 IST|Sakshi
సాక్షి టీవీ విలేకరిపై చిందులేస్తున్న మంత్రి కాలవ శ్రీనివాసులు

సాక్షి టీవీ విలేకరిపై మంత్రి కాలవ చిందులు

తాగునీటి సమస్య చెప్పేందుకు ఖాళీ బిందెలతో వచ్చిన మహిళలు

చిత్రీకరిస్తున్న విలేకరిపై పరుష పదజాలంతో బెదిరింపు

సాక్షి, రాయదుర్గం (అనంతపురం జిల్లా) : కాలవ శ్రీనివాసులు..సమాచారశాఖ మంత్రి..అంతకుముందు దాదాపు పదిహేనేళ్లు  జర్నలిస్టు.. ఇపుడు చూస్తున్నదీ సంబంధిత శాఖే..జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాల్సిన పదవిలో ఉన్న ఆయన..విధి నిర్వహణలో ఉన్న ఓ జర్నలిస్టును పరుష పదజాలంతో దూషించారు.  ‘ఏయ్‌ .. వీడియో తీయొద్దువయ్యా...తమాషా చేస్తున్నావా..? నీ అంతుచూస్తా...నేను అంత మంచివాడిని కాదు’ అంటూ ‘సాక్షి’ టీవీ విలేకరి విష్ణుపై ఊగిపోయారు. ఇక నుంచి తన కార్యక్రమాలకు రావద్దంటూ హూకుం జారీ చేశారు.  వివరాల్లోకవి వెళితే..రాయదుర్గం పట్టణంలోని జర్నలిస్టులకు 2011లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం కణేకల్లు రోడ్డులో ఇళ్లస్థలాలు ఇచ్చింది. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చాక..పాత పట్టాలు రద్దుచేసి, కొత్తపట్టాలను మంత్రి కాలవ శ్రీనివాసులు పంపిణీ చేశారు.

ఆ తర్వాత ఆ లేఅవుట్‌లో కొంతమంది విలేకరులకు ‘హౌస్‌ఫర్‌ ఆల్‌’ పథకంకింద ఇళ్లు మంజూరు చేశారు. ఆ లేఅవుట్‌లో సౌకర్యాలను పరిశీలించేందుకు మంత్రి కాలవ ఆదివారం సాయంత్రం అక్కడికి వచ్చారు. ఇది తెలుసుకున్న సమీపంలోనే ఉన్న ఎంసీఏ లేఅవుట్‌ మహిళలు తాగునీటి సమస్య చెప్పుకునేందుకు ఖాళీ బిందెలతో మంత్రి వద్దకు వచ్చారు. వారిని పోలీసులు అడ్డగించి.. వలి అనే వ్యక్తితో పాటు ఓ మహిళను మంత్రి వద్దకు పంపించారు. ‘ఏంటయ్యా ఖాళీ బిందెలతో వచ్చారు.. సమస్య చెప్పేందుకు ఒకరిద్దరు రావాలి గానీ ఖాళీ బిందెలతో వస్తావా..? ఆడవాళ్లతో నన్నే అడ్డుకోవాలని చూస్తావా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దృశ్యాలను సాక్షి టీవీ రిపోర్టర్‌ విష్ణు చిత్రీకరిస్తుండగా మంత్రి అగ్గిమీద గుగ్గిలమయ్యారు.. ‘ఏయ్‌ .. ఎందుకు తీస్తున్నావ్‌’ అని గదమాయించారు.

సార్‌ నీటి సమస్య చెబుతున్న విషయాన్ని తీస్తున్నా అని చెబితే ‘తీయొద్దు, ఇక కార్యక్రమాలకు సాక్షి విలేకరులు రావద్దు’ అంటూ హెచ్చరించారు. అంతటితో ఆగకుండా ‘లేనిపోనివి సృష్టిస్తున్నారు, పనికిమాలిన లం.కొ..లు మీడియాలో చేరి జర్నలిజం విలువలు తీస్తున్నారు’ అని ఆగ్రహంతో ఊగిపోయారు. వాడికి ఎవడైనా సపోర్ట్‌ చేస్తే వారి అంతు కూడా చూస్తా..ఏమనుకున్నారో ఏమో? అంటూ అక్కడే ఉన్న జర్నలిస్టులనూ హెచ్చరించారు.
 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కాచిగూడ కార్పొరేటర్‌ చైతన్యకు ఊరట

50 శాతం సీట్లు ఇస్తేనే పొత్తు..

టీఆర్‌ఎస్‌ను గద్దె దించేది ‘ఆ నలుగురే’

‘కేసీఆర్‌కు భవిష్యత్‌లో జైలు తప్పదు’

చంద్రబాబు సరిగా బ్రీఫ్‌ చేసినట్లు లేరు..

‘నేను పార్టీ మారడం లేదు’

‘ఆయనలా దొడ్డిదారిన రాజకీయాల్లోకి రాలేదు’

కోర్కెలు తీర్చే దేవుడు జగనన్న : జనసేన ఎమ్మెల్యే

సంకీర్ణ ప్రభుత్వానికి ఇక కష్టమే!

‘ఆ 26 భవనాలకు నోటీసులు ఇచ్చాం’

టీడీపీ సభ్యులకు సీఎం జగన్‌ సూచన..!

కన్నడ సంక్షోభంపై సుప్రీం కీలక తీర్పు

టీడీపీ సభ్యుల తీరుపై భగ్గుమన్న స్పీకర్‌..!

‘5 కోట్ల పనిని 137 కోట్లకు పెంచారు’

‘కిసాన్‌ సమ్మాన్‌’తో రైతులకు అవమానమే

కాళేశ్వరం.. తెలంగాణకు వరం

సిరా ఆరకముందే 80% హామీల అమలు

బెజవాడలో టీడీపీ నేతల సిగపట్లు

‘కాపు’ కాస్తాం

ఎంపీలకు ఢిల్లీ తెలుగు అకాడమీ సన్మానం

మంత్రుల డుమ్మాపై మోదీ ఫైర్‌

కర్నాటకంపై నేడే సుప్రీం తీర్పు 

మంచి రోడ్లు కావాలంటే టోల్‌ ఫీజు కట్టాల్సిందే 

బీజేపీలో చేరిన మాజీ ప్రధాని కుమారుడు

జయప్రద వర్సెస్‌ డింపుల్!

‘విభజన హామీలు నెరవేర్చుతాం’

అసెంబ్లీ ఎన్నికలు: కమలానికి కొత్త సారథి

‘కాపులను అన్ని విధాల ఆదుకుంటాం’

రెబెల్‌ ఎమ్మెల్యేల పిటిషన్‌పై రేపు సుప్రీం తీర్పు

‘కాపులను దశలవారీగా మోసం చేశారు’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’