‘చంద్రబాబు పచ్చి అబద్ధాలు ట్వీట్‌ చేశారు’

19 Nov, 2019 17:26 IST|Sakshi

సాక్షి, అమరావతి : వేరుశెనగ, మొక్కజొన్నపై టీడీపీ చేస్తున్న విమర్శలు అర్థం లేనివని వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు కొట్టిపారేశారు. మంగళవారం మంత్రి మోపిదేవి వెంకటరమణతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. మొక్కజొన్న కోసం ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. మొక్క జొన్న రైతులకు బోనస్‌ ఇవ్వకుండా మోసం చేసిన చంద్రబాబు.. నేడు పచ్చి అబద్ధాలను ట్వీట్‌ చేస్తున్నారని విమర్శించారు. రోజుకో దుష్ప్రచారంతో చంద్రబాబు చిల్లర రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.

తమది రైతు ప్రభుత్వంమని, ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతు భరోసాను అమలు చేస్తున్నారని తెలిపారు. అవినీతికి తావు లేకుండా రైతు ఖాతాలోనే నేరుగా పెట్టుబడి సాయం జమ అవుతుందన్నారు. తొలిసారిగా కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న ప్రభుత్వం తమదని చెప్పారు.దేవాదాయ భూములు చేస్తున్నవారికి పెట్టుబడి సాయం వర్తిస్తుందన్నారు. రైతు భరోసా ద్వారా 45లక్షల రైతు కుటుంబాలకు లబ్ది చేకూరుతుందని తెలిపారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రైతులకు ఎక్కడ మద్దతు ధరకు ఇబ్బంది వచ్చిన ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. 

సీఎం జగన్‌ నిర్ణయంతో టీడీపీ పునాదులు కదిలాయి
మార్కెట్‌లోకి వేరుశెనగ రాకుండానే నష్టపోయారని చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి మోపిదేవి వెంకటరమణ ఆరోపించారు. మొక్కజొన్న పంటలోనూ అన్ని అబద్ధాలే చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. వేరుశెనగ, సుబాబుల్‌ రైతులకు మద్దతు ధర కల్పించి ఆదుకున్నామని గుర్తుచేశారు. ఉల్లి ధరలు పెరిగినప్పుడు కూడా ప్రభుత్వం చొరవ తీసుకొని తగ్గించిందన్నారు. 5నెలల్లో రూ.470కోట్లు రైతుల గిట్టుబాబు ధరల కోసం ఖర్చు చేశామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మత్య్సకారుల దినోత్సవం జరుపుతున్న ప్రభుత్వం తమదని పేర్కొన్నారు. రైతుల పట్ల సీఎం జగన్‌ తీసుకుంటున్న నిర్ణయాలతో టీడీపీ పునాదులు కదిలిపోయాయని మంత్రి మోపిదేవి ఎద్దేవా చేశారు. 

మరిన్ని వార్తలు