ఆ నైతిక హక్కు టీడీపీ నేతలకు లేదు

14 May, 2020 11:23 IST|Sakshi

సాక్షి, విజయవాడ : జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ హీరో పవన్‌ కల్యాణ్‌ మాటలకే పరిమితమయ్యారని, చేతలు లేవని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ విమర్శించారు. గురువారం మంత్రి వెల్లంపల్లి విజయవాడ 41వ డివిజన్‌లో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్ బాబు‌లు హైదరాబాద్‌లో కూర్చుని నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలు బుద్దా  వెంకన్న, జలీల్ ఖాన్, కేశినేని నాని ప్రజల కష్టాలు చూసిన పరిస్థితి లేదని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే నైతిక హక్కు టీడీపీ నేతలకు లేదన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ను అరికట్టేందుకు సీఎం జగన్ అహర్నిశలు పని చేస్తున్నారని పేర్కొన్నారు. చదవండి : 'ఆ మాటలే అచ్చెన్న కమిటీని నవ్వులాటగా మార్చింది'

మరిన్ని వార్తలు