పవన్‌ గబ్బర్‌సింగ్‌ కాదు రబ్బర్‌సింగ్‌

2 Jan, 2020 10:26 IST|Sakshi

రాజధానిలో సినిమా స్టంట్లు చేస్తున్నారు

రైతులు రెచ్చగొట్టాలని చూస్తున్నారు

రాజకీయ ముసుగులో విధ్వంసానికి చంద్రబాబు, పవన్‌ యత్నం

కార్మికుల సంక్షేమం కోసమే ఆర్టీసీ విలీనం

మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కామెంట్స్‌

సాక్షి, విజయవాడ: రాజధానిలో  సినిమా స్టoట్లు చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చూస్తున్నారని, ఉద్దేశపూర్వకంగానే ఆయన రైతులను రెచ్చగొడుతున్నారని మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు. సినిమాల్లో గబ్బర్ సింగ్‌లా  పవన్‌ కల్యాణ్ ఈలలు వేయించుకొని ఉండొచ్చుకానీ, ఇప్పుడు ఆయన గబ్బర్‌సింగ్‌ రబ్బర్‌సింగ్‌ అని ఎద్దేవా చేశారు. రాజకీయ ముసుగులో విధ్వంసం సృష్టించాలని పవన్, చంద్రబాబు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పేరుతో రాజకీయ క్రీడకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. వారి ఆటలు సాగవని,  రైతులకు వైఎస్‌ జగన్‌హన్ రెడ్డి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఆయన గురువారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు.   అధికారులను చులకన చేసి మాట్లాడటం చంద్రబాబుకు అలవాటేనని, ప్రతిపక్ష నాయకుడన్న స్పృహను మరచి చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని తప్పుబట్టారు. నీతి నిజాయితీ కలిగిన పోలీసులకు, అధికారులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో శాంతియుతంగా  నిరసన తెలిపే ప్రయత్నం చేసిన తమను  అరెస్టు చేసి పోలీసులు స్టేషన్లు చుట్టు తిప్పారని గుర్తు చేశారు.


ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం సాధ్యం కాదని  అని అన్నారని, కానీ సంవత్సరానికి 3600 కోట్లు ప్రభుత్వనికి  భారమైనా సీఎం వైఎస్‌ జగన్‌ కార్మికుల సంక్షేమం కోసం ఈ  నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. వైఎస్‌ జగన్‌ చేసిన పాదయాత్రలో ఇచ్చిన హామీ అమలు కోసం అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపారని ప్రశంసించారు.  మంచి చేయడానికి డబ్బు కాదు సీఎం జగన్‌లాగా  మంచి మనసుకూడా ఉండాలన్నారు. ఆర్టీసి కార్మికులు తమని ప్రభుత్వంలో విలీనం చేయాలని గత ఐదేళ్లు డిమాండ్‌ చేసినా అప్పటి సీఎం చంద్రబాబును  పట్టించుకోలేదని విమర్శించారు. ఇచ్చిన మాటను నిలుపుకున్న నాయకుడు వైఎస్ జగన్‌ అని పేర్కొన్నారు. పక్కరాష్టంలో ఆర్టీసీ కార్మికుల నిరసనకు మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్‌కు మన రాష్ట్రంలో సీఎం జగన్‌ తీసుకున్న మంచి నిర్ణయాన్ని స్వాగతించలేక పోతున్నారని అన్నారు.

చంద్రబాబు క్షమాపణ చెప్పాలి
రాజధాని గురించి మాట్లాడేముందు చంద్రబాబు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.  ఐదేళ్లలో రాజధాని పూర్తి చేయలేకపోయానని చంద్రబాబు ఒప్పుకోవాన్నారు. 40 ఏళ్ల అనుభవంతో ఆయన ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారని నిలదీశారు. రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు వెంపర్లాడుతున్నారని మండిపడ్డారు. కేవలం 23 సీట్లు ఇచ్చి ప్రజలు తిరస్కరించిన నాయకుడు చంద్రబాబు అని గుర్తు చేశారు. పవన్ ,చంద్రబాబు, కన్నా లక్ష్మీ నారాయణకు రాజధాని  గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. జనసేన, బీజేపీ, టీడీపీ ఐదేళ్ల ఉమ్మడి పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని దుయ్యబట్టారు. లక్ష కోట్ల అంచనాతో లేని రాజధానిని చూపించే ప్రయత్నం చేశారని, ఇప్పుడు రైతుల ముసుగులో వారు చేస్తున్న  రాజకీయన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.

సీఎం జగన్‌ రాష్ట్రంలోని 13 జుల్లాలను అభివృద్ధి చేయాలని చూస్తున్నారని, రాష్ట్ర  అభివృద్ధే సీఎం లక్ష్యమని తెలిపారు. సీఎం జగన్‌ వేసిన  హైపవర్ కమిటీ.. చంద్రబాబు వేసిన నారాయణ కమిటీలా దోచుకునే కమిటీ కాదన్నారు. చంద్రబాబులా సీఎం జగన్‌ చెత్త కమిటీలు వేయరని పేర్కొన్నారు. సీఎం జగన్‌ను విమర్శించి రాజకీయ లబ్ధి పొందాలని చంద్రబాబు చూస్తున్నారని తప్పుబట్టారు. కానీ,  చంద్రబాబు, కన్నా లక్ష్మీ నారాయణ, పవన్ కల్యాణ్‌లను ప్రజలు నమ్మబోరని, వారు రాష్ట్రానికి పనికిమాలిన దద్దమలు అని అన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మా జీవితాలను తగ్గించొద్దు..

కరకట్ట వదిలి హైదరాబాద్‌కు పలాయనం..

ఉద్యోగులను బాబు కించపరుస్తున్నారు: సజ్జల

ముందుచూపులేని ‘లాక్‌డౌన్‌’

చంద్రబాబువి చౌకబారు విమర్శలు

సినిమా

దొరికిన‌ అవ‌కాశాన్ని వ‌దులుకోనంటున్న మ‌హేశ్‌

చేతులెత్తి నమస్కరిస్తున్నా : బాలకృష్ణ

ప్ర‌ధానిని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తిన రంగోలీ

బిగుతు దుస్తులు వ‌ద్ద‌న్నారు: ప‌్రియాంక‌

కరోనా : బాలయ్య విరాళం : చిరు ట్వీట్‌

విడాకులకు సిద్దంగానే ఉన్నావా అని అడిగారు..