భూ ఆక్రమణదారులపై ఉక్కుపాదం

26 Sep, 2019 04:52 IST|Sakshi
మాట్లాడుతున్న సుభాష్‌ చంద్రబోస్, చిత్రంలో మంత్రులు నారాయణస్వామి, పెద్దిరెడ్డి, శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్యేలు

రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్షలో మంత్రులు 

యూనివర్సిటీ క్యాంపస్‌ (తిరుపతి): ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ సిబ్బందిపై ఉందని ఏపీ ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ పేర్కొన్నారు. కబ్జాదారులు ఎంతటి వారైనా ఉపేక్షించొద్దన్నారు. తిరుపతిలోని ఎస్వీయూ సెనేట్‌ హాల్‌లో బుధవారం నవరత్నాలు, పేదలందరికీ ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణంపై రెవెన్యూ, గృహనిర్మాణ శాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు.  బోస్‌ మాట్లాడుతూ ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ పాడి పరిశ్రమ మీద ఆధారపడ్డ వారికి 3 సెంట్ల భూమి ఇచ్చే అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. మంత్రి కె.నారాయణస్వామి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లకు ప్లాస్టరింగ్‌ చేయించుకోలేని స్థితిలో పలువురు పేదలున్నారని, ఈ విషయాన్ని పరిశీలించాలని కోరారు. మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ నవరత్నాల అమలుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, జంగాలపల్లి శ్రీనివాసులు, నవాజ్‌ బాషా, పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, ఆదిమూలం, చింతల రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, కలెక్టర్‌ నారాయణ భరత్‌గుప్తా, తిరుపతి ఆర్డీవో కనక నరసారెడ్డి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు