కేసీఆర్‌తో స్టాలిన్‌ భేటీ రద్దు!

7 May, 2019 15:38 IST|Sakshi

చెన్నై: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుతో తమ పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ భేటీ కాకపోవచ్చని డీఎంకే వర్గాలు వెల్లడించాయి. తమిళనాడులో ఈనెల 19న జరగనున్న నాలుగు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ప్రచారంలో స్టాలిన్‌ బిజీగా ఉన్నందున కేసీఆర్‌తో సమావేశం కుదరకపోవచ్చని తెలిపాయి. పూర్తి వివరాలు వెల్లడించేందుకు డీఎంకే వర్గాలు నిరాకరించాయి.

చెన్నైలో ఈ నెల 13న స్టాలిన్‌తో కేసీఆర్‌ భేటీ అవుతారని తెలంగాణ సీఎంఓ ఇంతకుముందు తెలిపింది. దేశ రాజకీయాలు, లోక్‌సభ ఎన్నికల అనంతరం పరిణామాలు, కేంద్రంలో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు తదితర అంశాలపై స్టాలిన్‌తో కేసీఆర్‌ చర్చిస్తారని పేర్కొంది. తాజాగా డీఎంకే పార్టీ వర్గాల ప్రకటనతో భేటీపై సందిగ్ధం నెలకొంది. ఫెడరల్‌ ఫ్రంట్‌లో చేరడం​ ఇష్టం లేకే కేసీఆర్‌తో భేటీకి స్టాలిన్‌ విముఖత చూపారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఏప్రిల్‌ 18న తమిళనాడులో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో డీఎంకే జట్టు కట్టింది. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కాంగ్రెస్‌తోనే ముందుకు సాగాలన్న భావనతో డీఎంకే ఉన్నట్టు కనబడుతోంది. కాంగ్రెస్‌, బీజేపీ రహిత ఫెడరల్ ఫ్రంట్‌ ప్రతిపాదనతో ముందుకు వచ్చిన కేసీఆర్‌తో చర్చలు జరిపితే తప్పుడు సంకేతాలు వెళతాయన్న ఉద్దేశంతోనే తెలంగాణ సీఎంతో భేటీకి దూరంగా ఉండాలని స్టాలిన్‌ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

కాగా, కేసీఆర్‌ సోమవారం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో భేటీ అయ్యారు. జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలు ఏకమైతేనే గుణాత్మక మార్పు సాధ్యమని ఈ సందర్భంగా కేసీఆర్‌ అన్నారు. మరోవైపు కర్ణాటక​ ముఖ్యమంత్రి కుమారస్వామి సోమవారం ఉదయం కేసీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఒక్క మ్యాచే.. బాధపడొద్దు : జడేజా

మొత్తం వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తాం: వైఎస్‌ జగన్‌

వైఎస్‌ జగన్‌కు హామీ ఇచ్చా: మోదీ

 29న బెజవాడకు సీఎం కేసీఆర్‌

ఓటమి షాక్‌తో ఆహారం ముట్టని దిగ్గజ నేత..

అమిత్‌ షాతో వైఎస్‌ జగన్‌ భేటీ

ప్రభుత్వానికి పతన భయం? 

మోదీతో ముగిసిన వైఎస్‌ జగన్‌ భేటీ

‘రాహుల్‌ రాజీనామా డ్రామా’

శైలుకు ఘోర పరాభవం

అప్పుడు అన్నపై.. ఇప్పుడు తమ్ముడిపై

టీడీపీ కంచుకోటకు బీటలు

ఐదేళ్ల తర్వాత విముక్తి లభించింది

విజయకాంత్‌, ప్రేమలతపై సెటైర్లు..

చంద్రబాబు దత్తత గ్రామంలో వైఎస్సార్‌సీపీ సత్తా 

మమతా బెనర్జీ రాజీనామా..!

కాంగ్రెస్‌ చీఫ్‌గా ఉండలేను

జాతీయ ఆశయాలు.. ప్రాంతీయ ఆశలు

‘ముఖాముఖి’లో గల్లంతైన కాంగ్రెస్‌

80% మోదీ మ్యాజిక్‌

కలిసుంటే మరో 10 సీట్లు

రాష్ట్రపతికి నూతన ఎంపీల జాబితా సమర్పించిన ఈసీ

ఆస్తి రూ.1,107 కోట్లు.. దక్కింది1,558 ఓట్లు

లోక్‌సభలో తొలి అడుగులు

కలసి సాగుదాం

‘దేశానికి ఆ రాష్ట్రాలే ముఖ్యం కాదు’