నేను కరుణానిధిని కాను.. కానీ...

31 Aug, 2019 14:19 IST|Sakshi

కరుణానిధికి తగ్గ వారసుడిగా మారిన తీరు

అళగిరితో కలిసి తొలి ఎన్నికల్లోనే ప్రత్యర్థులకు షాక్‌

అదే స్ఫూర్తితో 2021 ఎన్నికలకు వ్యూహాలు  

‘‘నేను కరుణానిధిని కాను. కానీ నా తండ్రిలా మారేందుకు ప్రయత్నించే దమ్ము, ధైర్యం నాకున్నాయి’’ ఇదీ.. డీఎంకే అధిపతి స్టాలిన్‌ ఉద్వేగ పూరితంగా చేసిన తొలి ప్రసంగం. ఇదే ప్రసంగం... ఎనిమిదేళ్లుగా విజయదాహంతో పరితపిస్తున్న డీఎంకేని ఆయన గెలుపు తీరాలకు చేర్చేలా చేసింది. కరుణానిధి స్థానంలో డీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టినప్పడు ఎం.కె.స్టాలిన్‌ తన తండ్రి స్థానాన్ని భర్తీ  చేయగలడా? అన్న రాజకీయ వర్గాల గుసగుసలకు స్వస్తిపలుకుతూ... పార్టీ శ్రేణుల విశ్వాసాన్ని చూరగొనడానికి స్టాలిన్‌కి 2019 సార్వత్రిక ఎన్నికలు మంచి అవకాశాన్నిచ్చాయి. గత ఎన్నికల్లో ఒక్క సీటు మినహా మిగిలిన అన్ని స్థానాలనూ కైవసం చేసుకొని విజయదుంధుభి మోగించి, తమిళ ప్రజల్లో కలైంజర్‌ కరుణానిధికి తగ్గ వారసుడన్న ముద్ర వేయటంలో స్టాలిన్‌ కృతకృత్యులయ్యారు. నిజానికి ప్రారంభంలో స్టాలిన్‌ సోదరుడు ఎంకే అళగిరి సైతం అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని ప్రయత్నాలు చేశారు. అదే సమయంలో సోదరులిద్దరినీ విభజించి పబ్బం గడుపుకోవాలని బీజేపీ తమిళనాట అడుగుపెట్టే ప్రయత్నాలు జోరుగానే చేసింది. ఇదంతా చూసి... అళగిరితో ఎన్నికలకు ముందే పొత్తుపెట్టుకొని ద్రవిడ భూమిలో పాదం మోపాలన్న బీజేపీ ప్రయత్నాన్ని స్టాలిన్‌ చిత్తుచేయగలిగారు. జయలలిత, కరుణానిధి లేని తమిళనాడులో ఏర్పడిన రాజకీయ శూన్యతను అత్యంత సమర్థవంతంగా భర్తీ చేసిన స్టాలిన్‌ అతి కొద్దికాలంలోనే తమిళ ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారు.  

మోదీ గాలికి వ్యతిరేకంగా..
2019 ఎన్నికల్లో బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయిన అతికొద్ది రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. ఒక్క లోక్‌సభ సీటు మినహా తమిళనాడు, పుదుచ్చేరిలలో అన్నిటికి అన్నింటినీ కైవసం చేసుకుని, డీఎంకే తన రాజకీయప్రస్థానాన్ని సుస్థిరపరుచుకుంది. అంతకు ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం డీఎంకే విజయం సాధిస్తుందని ఆకాంక్షించినా, ఆర్కేనగర్‌ ఉప ఎన్నికల్లో శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్‌ గెలవడం డీఎంకే ఉత్సాహాన్ని కొంత నీరుగార్చింది. తండ్రి నాయకత్వ లక్షణాలను పుణికి పుచ్చుకున్న స్టాలిన్‌ దేశవ్యాప్తంగా మోదీ గాలి వీస్తున్నా బీజేపీకి వ్యతిరేకంగా నిలబడి తమిళనాట చరిత్ర సృష్టించగలిగారు. కశ్మీర్‌ స్వయంప్రతిపత్తిని రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తూ పార్లమెంటులో డీఎంకే ఎంపీలు అనుసరించిన వామపక్ష అనుకూల వైఖరి, రాజకీయవర్గాల్లో స్టాలిన్‌పై విశ్వాసాన్ని రెట్టింపు చేశాయి.

అది రుజువైంది..
ఒకసారి డీఎంకే అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక స్టాలిన్‌ తనని తాను సమర్థవంతంగా రుజువు చేసుకున్నారని స్టాలిన్‌ చిరకాల సహచరుడు, రాజ్యసభలో డీఎంకే పార్లమెంటరీ పార్టీ నాయకుడు తిరుచ్చి శివ వ్యాఖ్యానించారు. అయితే స్టాలిన్‌కీ అతని తండ్రి కరుణానిధికీ మధ్య ఉన్న విభేదాల విషయాన్ని చాలా మంది ప్రస్తావనకు తెస్తున్నారు. అయితే ఏ ఇద్దరూ ఒకేరకంగా ఉండరనీ, కశ్మీర్‌ విషయంలో స్టాలిన్‌ తీసుకున్న బీజేపీ వ్యతిరేక విధానం, కశ్మీర్‌లో అరెస్టు చేసిన రాజకీయ నాయకులను విడుదల చేయాలంటూ డీఎంకే ఎంపీలు ఢిల్లీలో నిరసనకు దిగడం స్టాలిన్‌కీ, కరుణానిధికీ ఉన్న సారూప్యతకు అద్దం పడుతోందనీ, సరిగ్గా కరుణానిధి ఇలాగే ఉండేవారని ఆయన చెప్పారు.

అవకాశాలను అందిపుచ్చుకోలేదా?
ఏఐడీఎంకేలోని లోపాలను స్టాలిన్‌ వాడుకోలేకపోయారన్న భావన పార్టీ వర్గాల్లో ఉంది. అయితే శత్రువు బలహీనతలను వాడుకొని, వారిని దెబ్బతీసే మనస్తత్వం ఆయనది కాదని కొందరి భావన. 2016లో జయలలిత మరణానంతరం ఏఐడీఎంకే లో విభేదాలను ఆయన నేర్పుగా ఉపయోగించుకొని ఉండాల్సిందన్న అభిప్రాయం వారిలో ఉంది. అలాగే దాదాపు 34 ఏళ్ళ పాటు డీఎంకే యువజన నాయకత్వ బాధ్యతలను నిర్వర్తించిన స్టాలిన్‌ తన కుమారుడు ఉదయనిధికి డీఎంకే యువజన కార్యదర్శి బాధ్యతలు అప్పజెప్పడం పట్ల సైతం కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే 2019 ఎన్నికల విజయోత్సాహాన్ని చేబూని, నాయకుడిగా తనని తాను నిలబెట్టుకుంటూనే, రాబోయే ఎన్నికల్లో పార్టీ స్థానాన్ని సుస్థిరపరుచుకునే వైపు స్టాలిన్‌ అడుగులు వేస్తున్నారు. దినకరన్, నటుడు కమల్‌హాసన్, డీఎంకేకి పెద్ద ప్రమాదకరం కాదని గత ఎన్నికలు రుజువు చేశాయి. రాబోయే ఎన్నికల్లో సైతం డీఎంకే, ఏఐడీఎంకేల మధ్యనే పోటీ ఉండనుంది. అయితే 2021 ఎన్నికల్లో రజనీకాంత్‌ ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది వేచి చూడాల్సి ఉంది. (చదవండి: వారసుడి ప్రజాయాత్ర)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆడియో, వీడియో సాక్ష్యాలున్నాయి: తమ్మినేని

ప్రాజెక్టుల పేరుతో దోపిడీ

ఈటలపై కుట్ర పన్నితే సహించం

‘ఆ పార్టీ కార్యకర్తలంతా వ్యభిచారులే’

రేషన్‌ కార్డులు తొలగిస్తారని భయపడొద్దు 

నవ్విపోదురు గాక మాకేటి సిగ్గు 

టీడీపీకి ‘రాజా’నామా.. ‘తోట’దీ అదే బాట

పవన్‌ పర్యటనలో టీడీపీ నేతలు

గేదెను దొంగిలించాడని ఎంపీపై కేసు

‘వచ్చే ఎన్నికల్లో ఈ సీట్లు కూడా రావు’

‘వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో ఆయన ఆగడాలు సాగవు’

కేసీఆర్‌.. మాతో రండి. చూసొద్దాం

‘మంత్రి ఈటలకు బీజేపీ సంఘీభావం’

‘టీఆర్‌ఎస్‌లో ఓనర్ల చిచ్చు మొదలైంది’

లక్షలకు లక్షలు ఎందుకు ఇస్తున్నారు?

రెండు వర్గాలుగా చీలిపోయిన టీడీపీ!

‘40 ఇయర్స్ ఇండస్ట్రీ చర్యలు ఎందుకు తీసుకోలేదో’

పవన్‌ రాజధాని పర్యటనపై ఆర్కే ఫైర్‌

‘షా’ సారథ్యంలో ఆర్టికల్‌ 370 రద్దుపై ప్రచారం

‘ఇంకో మూడు నెలల్లో టీడీపీ శాశ్వతంగా మూతే’

టీడీపీ  నేతల వితండవాదం...

టీడీపీ కుట్రలన్నీ చిత్తుచిత్తు

నాకేం సంబంధం: మంత్రి బొత్స ప్రశ్న

మంత్రి ఈటల సంచలన వ్యాఖ్యలు

టీడీపీకి మరో ఎదురుదెబ్బ; రాజా రాజీనామా

‘ఇది జగన్‌ ప్రభుత్వం.. లంచాలు ఉండవు’

అఫ్రిది నీకసలు బుర్ర ఉందా?

మోరీల్లో పడేది టీఆర్‌ఎస్‌ కార్యకర్తల తలలు కాదు...

‘ఆ చట్టం తీసుకురావాల్సిన బాధ్యత ఎన్డీయేదే’

గడువులోగా గ్రామ పంచాయతీ ఎన్నికలు: జూపల్లి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మా ఐరా విద్యా మంచు: విష్ణు

ఇద్దరు భామలతో విశాల్‌

నో మేకప్‌... ప్లీజ్‌!

మళ్లీ సినిమా చేస్తాం

ఫస్ట్‌ లేడీ

సైకిల్‌ షాప్‌ కుర్రాడి కథ