'బాలినేని సవాల్‌ను స్వీకరించే దమ్ము టీడీపీకి లేదు'

21 Jul, 2020 20:43 IST|Sakshi

సాక్షి, ప్రకాశం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని టీడీపీ నేతలు పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తున్నారని కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూధన్‌ యాదవ్‌ అన్నారు. ఏడాది పాలనపై ఆరోపించడానికి ఏమీ లేక మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిపై టీడీపీ నేతలు సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. ఎక్కడో తమిళనాడులో కారులో నగదు దొరికితే దానిని మంత్రి బాలినేనికి అంటగట్టడం సిగ్గుచేటు. (ప్రభుత్వ కాలేజీల్లో ఐఐటీ, జేఈఈలకు శిక్షణ)

ఆ డబ్బుకు సంబంధించిన సదురు వ్యాపారి అది తమదేనని ప్రకటించినా ఆరోపణలు కొనసాగించడం పచ్చనేతల దిగజారుడు తనానికి నిదర్శనం. తన తప్పు నిరూపిస్తే మంత్రి పదవిని వదులుకుంటానన్న బాలినేని సవాల్‌ను స్వీకరించే దమ్ము టీడీపీ నేతలకు లేదు. లోకేష్‌లాగా బాలినేని దొడ్డిదారిలో మంత్రి కాలేదు. అయిదు సార్లు ప్రజల మద్దతుతో ఎన్నికయ్యారని బుర్రా మధుసూధన్‌ యాదవ్‌ పేర్కొన్నారు. (చంద్రబాబు పెయిడ్‌ ఆర్టిస్ట్‌లతో డ్రామాలు ఆపాలి)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు