భవిష్యత్‌ మనదే

17 Feb, 2018 12:13 IST|Sakshi
మాట్లాడుతున్న నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య

జగన్‌ను సీఎంగా చూడటమే లక్ష్యం

టీడీపీలో కుమ్ములాటలు మొదలయ్యాయి

కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే ఐజయ్య

పాములపాడు: ‘ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన సీఎం చంద్రబాబు నాయుడు పాలనపై ప్రజలు విసిగి చెందారు.  ఓటుతో గుణపాఠం చెప్పేందుకే సిద్ధంగా ఉన్నారు.  భవిష్యత్‌ వైఎస్‌ఆర్‌సీపీదే. కలసికట్టుగా పని చేద్దాం’.. అంటూ నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం పాములపాడులో పార్టీ మండల మాజీ అధ్యక్షుడు చౌడయ్య అధ్యక్షతన వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం భారీగా డబ్బు ఎర వేసి ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని, అయితే  ఎన్నికలు రాక ముందే టీడీపీలో సీట్ల కోసం కుమ్ములాటలు మొదలయ్యాయన్నారు.

రాష్ట్ర అభివృద్ధి కంటే నియోజకవర్గాల పెంపు పైనే సీఎం ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారని విమర్శించారు. నయీంతో సంబంధాలున్న శివానందరెడ్డితో తాను పోటీపడలేనని ఎద్దేవా చేశారు. దళిత నియోజకవర్గమైన నందికొట్కూరులో రెడ్లకు పెత్తనం ఇచ్చారని విమర్శించారు. ప్రత్యేక హోదాపై ఆనాడు చెప్పిన మాటలు నేడు ఏమయ్యాయని చంద్రబాబును ప్రశ్నించారు. తమ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎంగా చూసుకోవాలన్నది అందరి లక్ష్యమని, అందుకోసం సైనికుల్లా పని చేద్దామంటూ పిలుపునిచ్చారు. పార్టీ కోసం నిరంతరం పాటు పడే కార్యకర్తలకు అండగా ఉంటానని, వారికి పార్టీలో ప్రాధాన్యత ఉంటుందన్నారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు నియోజకవర్గంలో త్వరలో రచ్చబండ, పల్లె నిద్ర కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

సోము వీర్రాజు ప్రశ్నలకు సమాధానం ఏదీ?
చంద్రబాబు నాయుడు రెండెకరాల ఆస్తి నుంచి రూ. 2 లక్షల కోట్ల ఆస్తి ఎలా సంపాదించారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అడిగిన ప్రశ్నకు సీఎం నుంచి సమాధానం ఎందుకు రాలేదని ప్రశ్ని ంచారు. కేంద్రం నిధుల్లో లెక్కలు ఎందుకు చూపడంలేదన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రంగస్వామి, రమణారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, బంగా రు మౌలాలి, ఓబన్న, బాలసుబ్బారెడ్డి, అంబన్న, అంబయ్య, ధర్మారాజు, మహేశ్వరరావు, రామస్వామి, రాజన్న, శ్రీనువాసులు, శేఖర్, సుధాకరరెడ్డి, ప్రభాకర్, దరగయ్య పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు