‘మంత్రి పై దాడి చేయడం హేయమైన చర్య’

18 Jun, 2020 11:28 IST|Sakshi

సాక్షి, గుంటూరు : శాసనమండలిలో టీడీపీ నేతలు తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని ఆ పార్టీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ విమర్శించారు. ద్రవ్యబిల్లును పెట్టనీయకుండా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..పేదల కోసం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను టీడీపీ అడ్డుకుంటోందని మండిపడ్డారు. మంత్రి వెల్లంపల్లిపై దాడి చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు.
(చదవండి : మండలిలో మరోసారి దుష్ట సంప్రదాయం!)

మంత్రి వెల్లంపల్లికి టీడీపీ సభ్యులు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. నలభై ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబుకు ద్రవ్యబిల్లు ప్రాధాన్యత తెలియదా అని ప్రశ్నించారు. సభ్యులు ఎక్కువగా ఉన్నారనే ఉద్దేశంతో రౌడీయిజానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు చాంబర్‌లో కూర్చొని సభ్యులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా చంద్రబాబు మారకుంటే టీడీపీ భూస్థాపితం కాకతప్పదని ఎమ్మెల్యే గిరిధర్‌ వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు