దేవెగౌడ ఇంటికెళ్తే టీ కూడా ఇవ్వలేదు

4 Aug, 2019 09:04 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: తాను పదవి..డబ్బులు కోసం రాజీనామా చేయలేదని నియోజక వర్గం అభివద్ధి కోసం రాజీనామా చేసిన్నట్లు కేఆర్‌ పేట జేడీఎస్‌ అనర్హత ఎమ్మెల్యే నారాయణగౌడ తెలిపారు. ఆయన శనివారం బెంగళూరులో విలేకర్లతో మాట్లాడారు. ‘మాజీ ప్రధాని దేవేగౌడ ఇంట్లో ఒక సిండికేట్‌ ఉంది. ఈ సిండికేట్‌ను ఆయన పెంచి పెద్ద చేశారు. ఒక ఎమ్మెల్యేగా అయన ఇంటికి వెళ్తే టీ కూడా ఇవ్వలేదు. చెప్పుడు మాటలను విని నన్ను వేధించారు’ అని ఆరోపించారు.

ఉప ఎన్నికలు వచ్చేలా ఉన్నాయి 
మండ్య: రెబెల్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో మూడు పార్టీల్లో ఉపఎన్నికల హడావిడి మొదలైందని, అయితే జేడీఎస్‌లో ఈ పరిస్థితి కొంచెం ఎక్కువగా ఉందని మాజీ మంత్రి చెలువనారాయణస్వామి తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ జేడీఎస్‌ అధినేతలు దేవేగౌడ,కుమారస్వామి కేఆర్‌ పేటె నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితులపై అధ్యయనం చేస్తున్నారని మిగిలిన పార్టీల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొందన్నారు. ఈ పరిణామాలన్నింటిని గమనిస్తుంటే ఉపఎన్నికల ప్రచారాలు మొదలైన ట్లు కనిపిస్తోందన్నారు. 17 మంది ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి సు ప్రీంకోర్టు వచ్చే వారంలో తీర్పు వెల్లడించే అవకాశం ఉందని, కోర్టు తీర్పు ఎ లా వచ్చినా ఉపఎన్నికలు జరిగేలాగానే కనిపిస్తున్నాయన్నారు. ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌–జేడీఎస్‌ మైత్రి కొనసాగితే తమకేమి అభ్యంతరాలు లేవన్నారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు