అమరావతికి వెళ్లి ఏం సాధించారు?

9 Oct, 2018 13:55 IST|Sakshi
మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి

కౌన్సిల్‌ను రద్దు చేసే అధికారం సీఎంకు ఎక్కడిది

ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి

వైఎస్‌ఆర్‌ జిల్లా, ప్రొద్దుటూరు క్రైం :  ప్రొద్దుటూరు టీడీపీ నాయకులు అమరావతికి వెళ్లి ఏం సాధించారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ప్రశ్నించారు. స్థానిక 31వ వార్డులో సోమవారం ఎమ్మెల్యే విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎందుకు అమరావతికి వెళ్లారో ప్రొద్దుటూరులోని టీడీపీ నాయకులందరూ ఒక తా టిపైకి వచ్చి ప్రకటన చేయాలని డిమాండు చేశారు. ఏం అభివృద్ధి చేశారో టీడీపీ నాయకులు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అమరావతికి వెళ్లి ఫేస్‌బుక్‌లో ఫొటోలు పెడతారా.. సిగ్గు లేదా మీకు అని ఎమ్మె ల్యే అన్నారు. ఆధిపత్యం కోసం కొట్లాడుకొని, అమరావతికి వెళ్లి సీఎంతో చివాట్లు తిని ప్రొద్దుటూరుకు వస్తారా అని అన్నారు. ఆధిపత్యం కోసం పోరాడుతున్నారు తప్ప  ఏనాడైనా అభివృద్ధి కోసం ఆలోచన చేశారా సీఎం చంద్రబాబు టీడీపీ నాయకులకు గడ్డిపెట్టినా బుద్ధి రాలేదన్నారు. 22 మంది రాజీనామా చేసి ఏం సాధించారని ప్రజలు అసహ్యింకుంటున్నారన్నారు. మీ రాజీనామాలను వెనక్కి తీసుకున్నట్టా.. తీసుకోనట్టా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు.  

కౌన్సిల్‌ను రద్దు చేసే అధికారం సీఎంకు ఎవరిచ్చారు..?
 తెలుగుదేశం పార్టీ అంతర్గత కలహాల వల్ల ప్రొద్దుటూరు మున్సిపల్‌ కౌన్సిల్‌ను రద్దు చేసే అధికారం సీఎం చంద్రబాబుకు ఎవరు ఇచ్చారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. టీడీపీ నేతలకు చివాట్లు పెట్టి ప్రొద్దుటూరును అభివృద్ధి చేయడానికి ఆలోచించాల్సిన సీఎం కౌన్సిల్‌ను రద్దు చేస్తానని చెప్పడం మంచిది కాదన్నారు. ప్రజాస్వామ్యంలో చట్టసభలను రద్దు చేసే అధికారం ఎవ్వరికీ లేదని ఎమ్మెల్యే చెప్పారు. ఫైవ్‌మ్యాన్‌ కమిటీ ఎందుకు వేశారో చెప్పాలని డిమాండు చేశారు. కుందూ–పెన్నా వరద కాలువలో ఎందుకు జాప్యం జరుగుతోంది, అమృత్‌ పథకం కింద మంజూరైన పప్‌లైన్‌ పనులు ఎంత వరకు వ చ్చాయి, పక్కా గృహాలు ఎన్ని కట్టించాలి.. ఇలాంటి విషయాలపై సీఎం చంద్రబాబు కమిటీ వేసి నివేదిక కోరి ఉంటే ధన్యవాదాలు చెప్పేవాళ్లమన్నారు. సమావేశంలో  పార్టీ పట్టణాధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గజ్జల కళావతి, చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బలిమిడి చిన్నరాజు, జిల్లా అధ్యక్షుడు భీమునిపల్లి నాగరాజు, నాయకులు పోరెడ్డి నరసింహారెడ్డి, కల్లూరు నాగేం ద్రారెడ్డి, పోతిరెడ్డి మురళీనాథరెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు