బీజేపీతో చంద్రబాబు లాలూచీ: ఎమ్మెల్యే రోజా

24 Jul, 2018 13:28 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆర్కే రోజా

సాక్షి, తిరుపతి: బీజేపీతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాలూచీ పడ్డారని నగరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం చేపట్టిన రాష్ట్ర బంద్‌లో పాల్గొన్న ఆమెను పుత్తూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా మట్లాడుతూ... చంద్రబాబు ఆదేశాలతో పోలీసులు ఉద్యమాన్ని అణచి వేయాలని చూడటం నీచ రాజకీయమని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబుకు లేదన్నారు. ప్రత్యేక హోదా కోసం బంద్ పాటిస్తుంటే అరెస్టులు చేయటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. టీడీపీ అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు.

ప్రత్యేక హోదా సాధన కోసం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బంద్‌ పాటిస్తున్న తమను అరెస్ట్‌ చేయడాన్ని పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ ఖండించారు. ‘మీరు చేసిన దొంగ దీక్షలకు పోలీసుల రక్షణ కావాలి. ప్రత్యేక హోదా సాధించేందుకు నాలుగున్నరేళ్లుగా పోరాటం చేస్తున్న మమ్మల్ని మాత్రం అరెస్ట్‌ చేస్తారా?’ అని ప్రశ్నించారు.

కలిగిరి ఎస్‌ఐ దాష్టీకం
చిత్తూరు జిల్లా పీలేరులో బంద్‌ చేస్తున్న వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై ఎస్‌ఐ శ్రీనివాస్‌ రౌడీయిజం ప్రదర్శించారు. ఆందోళకారులను విచణారహింగా కొట్టడమే కాకుండా ఎన్‌కౌంటర్‌ చేస్తానని బెదిరించారు. ఎస్‌ఐ తీరుకు నిరసనగా ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బైఠాయించారు.

సంబంధిత కథనాలు:

ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతోన్న బంద్‌

మహిళలను ఈడ్చిపడేశారు

హోదా ఉద్యమాన్ని బాబు అణచడం దారుణం: సీపీఎం

బాబూ.. బంద్‌ను ఎందుకు అడ్డుకుంటున్నారు?

మరిన్ని వార్తలు