‘రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోంది’

14 Mar, 2020 12:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. వివిధ వర్గాలవారు అసెంబ్లీ ముట్టడికి వస్తుంటే.. రాష్ట్రంలో ఎలాంటి పాలన కొసాగుతుందో అర్థమవుతోందని అన్నారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆమె మాట్లాడుతూ.. ఓ ఒక్క రంగాన్ని పట్టించుకోని ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమని విమర్శించారు. తమది ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెబుతున్న టీఆర్‌ఎస్‌.. మహిళలు, టీచర్లు, విద్యార్థులను అరెస్ట్‌ చేయడమే ఫ్రెండ్లీ ప్రభుత్వమా అని ప్రశ్నించారు. (మంత్రిపై సీతక్క ఆగ్రహం)

ఆశా వర్కర్లను పిలిచి భోజనాలు పెట్టి వారి జీతాలు పెంచారు.. కానీ వారికి ఇప్పటి వరకు జీతాలు అందడం లేదని మండిపడ్డారు. ఆశా వర్కర్లను ప్రభుత్వం నమ్మించి గోంతు కోసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఆశా వర్కర్లతో సర్వం పనులు చేయించుకుంటారు. కానీ వారి పనికి వేతనం కల్పించరని దుయ్యబట్టారు. నిన్న టీచర్లు, మొన్న ఆశా వర్కర్లు, అంతకముందు విద్యార్థులు.. ఇలా ప్రతి ఒక్కరినీ అరెస్టు చేసి వారిపై లాఠీ చార్జీ చేశారన్నారు. అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీతక్క డిమాండ్‌ చేశారు. (‘టీఆర్‌ఎస్‌లో ఓనర్షిప్‌ల కొట్లాట మొదలైంది’)

మరిన్ని వార్తలు