అందుకే చంద్రబాబుపై తిరుగబడ్డారు..

3 Dec, 2019 20:11 IST|Sakshi

దండుపాళ్యం ముఠాలా చంద్రబాబు అండ్ బ్యాచ్ దోచుకుంది

చంద్రబాబు మళ్లీ రాజధానికి వస్తే తరిమి కొడతారు

సాక్షి, తాడేపల్లి: రాజధాని పేరుతో మోసం చేసిన చంద్రబాబుపై రాళ్లు వేయకుండా.. పూలు వేస్తారా అని వైఎస్సార్‌సీపీ తాటికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చంద్రబాబు మోసం చేశారు కాబట్టే ప్రజలు, రైతులు తిరుగబడ్డారని చురకలు అంటించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఓర్వలేక పోతున్నారని  ధ్వజమెత్తారు.  ప్రతిపక్ష పార్టీలు నిర్మాణాత్మక పాత్ర పోషించాలని కోరారు. నిన్నటి వరకు ఇసుక అన్న చంద్రబాబు.. నేడు లాఠీ అని మతిభ్రమించి మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో చంద్రబాబును ఓడించి ప్రజలు తగిన బుద్ది చెప్పినా ఏ మార్పు రాలేదన్నారు. తెనాలి నుంచి అద్దెకు ఆర్టిస్టులను తెప్పించుకొని.. చంద్రబాబు మీద వేసిన చెప్పుల సంఘటనపై సిట్ ఏర్పాటు చేయడాన్ని తప్పుబట్టారు.

ఇక చంద్రబాబు హయాంలో సిట్ అంటే సిట్ అండ్‌ స్టాండ్‌లా తయారైందని శ్రీదేవి హేళన చేశారు. చంద్రబాబు మళ్లీ రాజధానికి వస్తే తరిమి కొడతారని హెచ్చరించారు. చంద్రబాబు గ్రాఫిక్స్ పేరుతో ఖర్చు చేసిన డబ్బు ప్రజలకు ఖర్చు చేసినా బాగుండేదన్నారు. అమరావతితో చంద్రబాబు రాజకీయాలు మానుకుని.. రైతులకు, రైతు కూలీలకు సాష్టాంగ నమస్కారం చేయాలని అభిప్రాయపడ్డారు. అంబేద్కర్ స్మృతి వనమని దళితులను మోసం చేసిన చంద్రబాబు.. పరిహారం విషయంలోనూ దళితుల పట్ల వివక్ష చూపారని మండిపడ్డారు. తీసుకున్న భూములకు ఫ్లాట్స్ ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. రాజధానిలో చంద్రబాబు బినామీలు, టీడీపీ నేతలు పెద్ద ఎత్తున భూములు కొన్నారని ఆరోపణలు చేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్‌తో మోసానికి పాల్పడిన చంద్రబాబును.. 5న జరిగే అఖిలపక్ష సమావేశం గ్రాఫిక్స్ రాజధానిలో పెట్టాలన్నారు. సీఆర్డీఏ అంటే చంద్రబాబు రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్‌ అథారిటీగా మార్చేశారని.. రాజధాని ప్రజలను మోసం చేసిన చంద్రబాబును అమరావతి శిల్పి అంటారా లేదా దొంగ అంటారా అంటూ ప్రశ్నించారు. దండుపాళ్యం ముఠాలా చంద్రబాబు అండ్ బ్యాచ్ దోచుకుని.. లింగమనేనికి రూ. 4 వేల కోట్ల లబ్ది చేకూర్చారని ఆరోపించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా