‘బాబును దళిత సమాజం ఏనాడు క్షమించదు’

17 May, 2020 13:23 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ప్రకాశం జిల్లాలో జరిగిన ట్రాక్టర్ రోడ్డు ప్రమాదం బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా అందించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వైఎస్సార్‌సీపీ ఎమ్యెల్యే సుధాకర్‌ బాబు ధన్యవాదాలు తెలిపారు. ఆయన ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో​ మాట్లాడుతూ.. ట్రాక్టర్‌ ప్రమాదం జరిగిన 24 గంటలులోపే బాధిత కుటుంబాలకు సీఎం జగన్‌ ఎక్స్ గ్రేషియా అందించారని ఆయన గుర్తుచేశారు. చంద్రబాబు 15వ తేదీ పత్రిక ప్రకటన జారీ చేసి డాక్టర్‌ సుధాకర్ ఎలా మాట్లాడాలో ముందే స్క్రిప్ట్  రచించారని ఆయన మండిపడ్డారు.16వ తేదీన సంఘటన జరిగితే ఒక రోజు ముందే పత్రిక ప్రకటన చేశారని దుయ్యబట్టారు. దళిత సమాజము పట్ల మొదటి నుంచి చంద్రబాబుకు చిన్నచూపే ఉందని, చంద్రబాబు దళిత అనే పదం వాడటం మానుకోవాలని అన్నారని సుధాకర్‌బాబు ఫైర్‌ అయ్యారు. మతి స్థిమితంలేని డాక్టర్ సుధాకర్ ఏవేవో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఎందుకు పెట్టకూడదని ఆయన ప్రశ్నించారు. ('ఎల్లో ఛానల్స్‌లో చూసుకున్నాకే నిద్రపోతాడు')

చంద్రబాబు దళితుల్ని ప్రలోభాలకు గురిచేసి తప్పుదారి పట్టించిన వ్యక్తి అని, అదేవిధంగా డాక్టర్‌ సుధాకర్‌ను కూడా తప్పుదారి పట్టించారని అని తెలిపారు. నక్క ఆనందబాబు నక్కజిత్తులు ప్రదర్శిస్తున్నారని, దళితులల్లో ఎవరైనా పుడతారా అంటూ చంద్రబాబు వ్యాఖ్యాలు చేసినప్పుడే నక్క ఆనంద బాబు రాజీనామా చేసి ఉండాలన్నారు. ఆనాడు దళితులుపై ప్రేమ ఎందుకు లేదని, దళిత సమాజంలో చంద్రబాబును కోరుకునే వారే లేరని సుధాకర్‌బాబు విరుచుకపడ్డారు. ఆంగ్ల విద్య విధానం దూరం చేసి దళితులకు అన్యాయం చేసింది చంద్రబాబు అని ఆయన మండిపడ్డారు. టీడీపీ హయంలో దళితులు ఊచకోతకు గురయ్యారు, ఆ కుటుంబాలను ఎప్పుడు అడిగినా బాబు దారుణాల గురించి చెబుతారని ఆయన అన్నారు. నక్క ఆనందబాబు దొంగదీక్ష ఎలా చేస్తారని, ఆనాడు దళితుల్ని అవమానించినపుడు ఆయన  ఏమయ్యారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. దళితవాడల్లోకి చంద్రబాబు వస్తే తాము నిలదీస్తామన్నారు. ఎందుకు ఆంగ్ల విద్య దూరం చేశారని ప్రశ్నిస్తామన్నారు. తమ బిడ్డలు చదువుకునే స్కూల్స్ అన్ని బాగుండాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కోరుకుంటున్నారని ఎమ్మెల్యే సుధాకర్‌ బాబు అన్నారు. చంద్రబాబును దళిత సమాజం ఏనాడు క్షమించదని ఆయన మండిపడ్డారు.
 

మరిన్ని వార్తలు