'చెస్ట్ హాస్పిట‌ల్‌లో ఆక్సిజ‌న్ ఎందుకు పెట్ట‌లేదు'

30 Jun, 2020 13:42 IST|Sakshi

సాక్షి, జగిత్యాల : ప‌్ర‌భుత్వ ఆసుప‌త్రిలో ఆక్సిజ‌న్ అందించ‌క‌పోవ‌డం చాలా బాధ‌క‌ర‌మ‌ని ఎమ్మెల్సీ జీవ‌న్‌రెడ్డి విచారం వ్య‌క్తం చేశారు. చెస్ట్ ఆస్ప‌త్రిలో ఆక్సిజ‌న్ ఎందుకు పెట్ట‌లేద‌నే విషయంపై క్లారిటీ ఇవ్వ‌కుండా ఆరోగ్య‌శాఖ మంత్రి సెల్ఫీ వీడియోను త‌ప్పుప‌డుతున్నార‌ని మండిప‌డ్డారు. ముఖ్య‌మంత్రికి క‌నీస నైతిక బాధ్య‌త ఉంటే రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు. ఈ వి‌‌‌ష‌యంలో ఇంతవ‌ర‌కు స్పంద‌న లేద‌ని ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు. బలవన్మరణానికి పాల్పడిన వారికి సంబంధించి మానవ హక్కుల కమిషన్ సుమోటోగా పరిగణనలోకి తీసుకుని చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. (మళ్లీ లాక్‌డౌన్‌.. సిద్ధంగా ఉన్నారా?)

తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు జీవించే హక్కు కోల్పోతున్నార‌ని జీవ‌న్‌రెడ్డి పేర్కొన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాల‌న్నారు. దేశంలో ఆయుష్మాన్ భార‌త్‌, ఆరోగ్య శ్రీ పొంద‌టానికి ప్ర‌తి పౌరుడికి హ‌క్కుంద‌ని, ఆయుస్మాన్ భారత్‌ను తక్షణమే రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా సేవల కోసం ప్రైవేట్ హాస్పిటల్‌కు రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ధరలు అమలు కావడం లేదని విమ‌ర్శించారు. అన్నింటికీ ఒకే వైద్యం క్వారంటైన్ అనే స్థాయికి ప్రభుత్వం దిగజారిందన్నారు. (తెలంగాణ డిప్యూటీ స్పీకర్‌కు కరోనా)

ఉద‌యం ఆరు గంట‌ల నుంచి సాయంత్రం ఆరు గంటల‌ వరకు అత్యవసర సేవలు మినహా కఠిన లాక్‌డౌన్‌ అమలు చేయాల‌ని జీవ‌న్ రెడ్డి తెలిపారు. వ్యాపార సంస్థలను, వైన్ షాప్, బెల్ట్‌షాప్‌ల‌ను 4 గంటల వరకు బంద్ చేయాంచాల‌న్నారు. గత వారం రోజులు రాష్ట్రంలో కరోనా పరీక్షలే నిర్వహించలేద‌ని, ఇప్పుడు మొదలు పెట్టార‌న్నారు. కరోనా ఆరంభంలో కేంద్రప్రభుత్వం అమెరికా ట్రంప్ పర్యటనలో భాగంగా ఒక నెల జాప్యం చేసింద‌ని దుయ్య‌బ‌ట్టారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ప్రతి నిరుపేద కుటుంబంపై భారం పడుతుంద‌ని, ఇది కేంద్ర ప్రభుత్వ ఆనాలోచిత విధానానికి నిదర్శన‌మని జీవ‌న్‌రెడ్డి అ‌న్నారు. (కరోనా: పెళ్లైన రెండు రోజులకే వరుడు మృతి)

మరిన్ని వార్తలు